ఎయిర్ పోర్టులో మంత్రి బుగ్గనకు చేదు అనుభవం.. లోపలికి అనుమతించని వైనం..

Published : Jun 14, 2021, 10:36 AM IST
ఎయిర్ పోర్టులో మంత్రి బుగ్గనకు చేదు అనుభవం.. లోపలికి అనుమతించని వైనం..

సారాంశం

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి తిరుపతి విమానాశ్రయంలో ఆదివారం చేదు అనుభవం ఎదురైంది. రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ రెండు రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు వచ్చారు. ప్రొటోకాల్ ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వాగతం పలకడానికి రాష్ట్ర మంత్రి వచ్చారు. 

తిరుగు ప్రయాణంలో భాగంగా విమానాశ్రయంలో వీడ్కోలు చెప్పడానికి మంత్రి బుగ్గన వీఐపీ గేటు వద్దకు రాగా భద్రతా సిబ్బంది లోపలికి అనుమతించలేదు. మంత్రి ప్రవేశించే ప్రయత్నం చేయగా బలంగా వెనక్కి నెట్టడంతో కిందపడిపోయే పరిస్థితి తలెత్తింది. దీంతో కేంద్ర మంత్రికి వీడ్కోలు పలకలేని పరిస్థితి నెలకొంది. 

తనను అడ్డుకున్న భద్రతా సిబ్బంది వివరాలు ఇవ్వాలని విమాశ్రయ అధికారులను రాష్ట్ర మంత్రి కోరారు. ఈ సందర్భంగా రాజేంద్రనాథ్ రెడ్డికి విమానాశ్రయ అధికారులు సర్దిచెప్పే  ప్రయత్నం చేశారు. ఈ పరిణామంతో విమానాశ్రయంలో కొంత సమయం గందరగోళం నెలకొంది. 
 
PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్