ఎమ్మెల్సీల నియామకం: వైఎస్ జగన్ కు గవర్నర్ షాక్, సాయంత్రం భేటీ

By telugu team  |  First Published Jun 14, 2021, 10:06 AM IST

తాను నామినేట్ చేసే ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ఫైలును గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ పెండింగులో పెట్టినట్లు తెలుస్తోంది. ఆ నలుగురిలో ఇద్దరిపై ఆయనకు అభ్యంతరం ఉన్నట్లు చెబుతున్నారు.


అమరావతి: ఎమ్మెల్సీల నియామకం విషయంలో గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తన నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీస నియామకానికి జగన్ ప్రభుత్వం పంపిన జాబితాను ఆయన పెండింగులో పెట్టినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీల నియామకానికి ప్రభుత్వం నలుగురి పేర్లతో ఓ జాబితాను గవర్నర్ కు పంపించింది.

ప్రభుత్వం పంపించిన జాబితాలోని నలుగురిలో ఇద్దరిపై గవర్నర్ అభ్యంతరం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ హరిచందనన్ కలువబోతున్నారు. గవర్నర్ నామినేటెడ్ కోటాలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. వాటి భర్తీకి ప్రభుత్వం నలుగురి పేర్లతో ఓ జాబితాను గవర్నర్ కు సమర్పించింది. 

Latest Videos

లేళ్ల అప్పిరెడ్డి (గుంటూరు జిల్లా), తోట త్రిమూర్తులు (తూర్పు గోదావరి జిల్లా), మోషేన్ రాజు (పశ్చిమ గోదావరి జిల్లా), రమేష్ యాదవ్ (అనంతపురం జిల్లా) పేర్లను ప్రభుత్వం సిఫార్సు చేసింది. చాలా వరకు వెంటనే ఆ నియామకం ఫైలుపై గవర్నర్ సంతకం చేసి తిరిగి పంపిస్తారు. కానీ గవర్నర్ నాలుగు రోజులుగా ఆ ఫైలును పెండింగులో పెట్టారు. 

నలుగురిలో లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రీమూర్తులుపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు గవర్నర్ కు ఫిర్యాదులు వెళ్లాయి. దాంతో గవర్నర్ కార్యాలయం వివరాలు తెప్పించుకున్నట్లు సమాచారం. త్రిమూర్తులుపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదై ఉంది. అప్పిరెడ్డిపై పలు క్రిమినల్ కేసులున్నాయి. దీంతో గవర్నర్ ఫైలును పెండింగులో పెట్టినట్లు తెలుస్తోంది.

click me!