టీ కాచిన కన్నబాబు.. సూపర్ అంటున్న వెల్లంపల్లి...

Published : Feb 24, 2021, 02:09 PM IST
టీ కాచిన కన్నబాబు.. సూపర్ అంటున్న వెల్లంపల్లి...

సారాంశం

మేయర్‌ పీఠాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంటుందని మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్,  కురసాల కన్నబాబు అన్నారు. బుధ‌వారం  నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో కొండ‌వీడు అకాడ‌మీ నుంచి ప్రియ‌ద‌ర్శ‌ని కాల‌నీ, పాత హౌసింగ్ బొర్డు కాల‌నీలో మంత్రులు‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

ప్ర‌చారంలో భాగంగా మంత్రులు టీ దుకాణం వ‌ద్ద కొద్ది సేపు ఆగి అంద‌రిని అశ్చ‌ర్యప‌రిచారు. టీ స్టాల్ యజమానిని పలకరించారు. అంతేకాదు మంత్రి స్వయంగా ఛాయ్ పెట్టి అక్కడున్న అందరికీ తాగించారు. 

వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కులమతాలు, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని చెప్పారు. వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల‌ను  అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

 టీడీపీ నేతలు పగటి కలలు కంటున్నారని, పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను వైయస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?