రోడ్డు ప్రమాదానికి గురయిన మంత్రులు అనిల్, మేకపాటి వాహనాలు

Arun Kumar P   | Asianet News
Published : Nov 09, 2020, 11:21 AM ISTUpdated : Nov 09, 2020, 11:31 AM IST
రోడ్డు ప్రమాదానికి గురయిన మంత్రులు అనిల్, మేకపాటి వాహనాలు

సారాంశం

సోమవారం ఉదయం కృష్ణాపురం హై లెవల్ కెనాల్ ఫేజ్-2 పైలాన్ ప్రారంభోత్సవానికి మంత్రులు అనిల్ కుమార్, మేకపాటి వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు. 

నెల్లూరు: మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ సోమవారం ఉదయం కృష్ణాపురం హై లెవల్ కెనాల్ ఫేజ్-2 పైలాన్ ప్రారంభోత్సవానికి వెళుతూ ప్రమాదానికి గురయ్యారు. మంత్రులు కాన్వాయ్ లోని వాహనాలన్నీ వేగంగా వెళుతుండగా మొదటి వాహనం అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో వెనకాల వున్న వాహనాలు అదుపుతప్పి ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో మంత్రుల వాహన శ్రేణిలోని మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి.  

ఈ ప్రమాదం నుండి మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి గురయిన వాహనాల్లో వున్నవారు కూడా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి టోల్‌ప్లాజా వద్ద చోటుచేసుకుంది. ప్రమాదానికి గురయిన వాహనాలను కాన్వాయ్ నుండి తప్పించి మిగతా వాహనాలు ముందుకు వెళ్లాయి. 
 

PREV
click me!

Recommended Stories

భీమవరం బహిరంగ సభకు సినిమా రేంజ్ లో జగన్ ఎంట్రీ | YS Jagan Bhimavaram Tour
Rain Alert: జూలైలో వర్షాలలోటు తీరుతుందా? ఇక తెలంగాణలో వర్షాలు దంచుడే | AP & Telangana Weather Update