అమరావతి రైతుల పాదయాత్రకు ప్రొడ్యూసర్ చంద్రబాబే.. : విడదల రజిని

By Siva KodatiFirst Published Sep 18, 2022, 6:42 PM IST
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని. అమరావతి రైతుల పాదయాత్రకు చంద్రబాబే ప్రొడ్యూసర్ అని ఆమె ఆరోపించారు. 

మూడు రాజధానుల అవసరాన్ని సీఎం ఇప్నటికే చెప్పారని అన్నారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తమకు రాజ్యాంగం, న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందన్నారు. చంద్రబాబు ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని... చంద్రబాబు నాయుడు డైరెక్షన్‌లో పాదయాత్ర జరుగుతోందని పేర్కొన్నారు. శాంతిభద్రతల సమస్య వస్తే చంద్రబాబే బాధ్యత వహించాలని రజిని డిమాండ్ చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ఐదు మెడికల్ కాలేజ్‌ల్లో అడ్మిషన్లు జరుగుతాయని ఆమె తెలిపారు.

చంద్రబాబు మెడికల్ కాలేజ్ తీసుకురావాలన్న ఆలోచన కూడా చేయలేదని.. అబద్దాలు చెప్పాల్సిన  అవసరం తమకు లేదని విడదల రజిని స్పష్టం చేశారు. ఒక పద్దతి, ప్రణాళిక ప్రకారం మెడికల్ కాలేజ్ లు తీసుకొస్తామని.. తల్లిలాంటి భారతిపై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని, తాము కూడా అదేస్థాయిలో సమాధానం చెప్తామని మంత్రి హెచ్చరించారు. మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి తమ ప్రభుత్వం ద్యేయమని ఆమె తెలిపారు. రాజధాని ఎక్కడ ఉండాలనేది ప్రభుత్వం హక్కు అని రజిని పేర్కొన్నారు. 

ALso Read:మూడు రాజధానులపై రెఫరెండానికి సిద్దం: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు

రాజధాని విషయంపై సుప్రీంకోర్టులో తమ ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం వస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని... చంద్రబాబు డైరెక్షన్‌లో పాదయాత్ర చేస్తున్నారని ఆమె ఆరోపించారు. 17 మెడికల్ కాలేజ్‌‌లను అభివృద్ధి చేయడం ప్రభుత్వం ద్యేయమని విడదల రజిని స్పష్టం చేశారు. 17 మెడికల్ కాలేజ్‌ల ద్వారా 2500 ఎంబీబీఎస్ సీట్లు పెరగబోతున్నాయన్నారు. 17 మెడికల్ కాలేజీలకు రూ.3,800 కోట్లు ఖర్చు చేస్తామని రజినీ పేర్కొన్నారు. చంద్రబాబుకి మెడికల్ కాలేజ్‌లు తేవడం చేతగాలేదని... రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని సీఎం కృషి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. 
 

click me!