తాగి పడుకున్న దద్దమ్మలు ఇప్పుడు మాట్లాడుతున్నారు: టీడీపీ నేతలపై వెల్లంపల్లి వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Jul 17, 2020, 03:19 PM IST
తాగి పడుకున్న దద్దమ్మలు ఇప్పుడు మాట్లాడుతున్నారు: టీడీపీ నేతలపై వెల్లంపల్లి వ్యాఖ్యలు

సారాంశం

ఆగస్ట్ నెలలో దుర్గగుడి ఫ్లైఓవర్‌ని ప్రారంభిస్తామన్నారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ . శుక్రవారం ఫ్లైఓవర్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు.

ఆగస్ట్ నెలలో దుర్గగుడి ఫ్లైఓవర్‌ని ప్రారంభిస్తామన్నారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ . శుక్రవారం ఫ్లైఓవర్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ... ఆగస్ట్ నెలలో దుర్గగుడి ఫ్లైఓవర్‌ని ప్రారంభిస్తామని.. 97 శాతం మేరకు పనులు పూర్తయ్యాయి.

మాది చంద్రబాబులా మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమన్నారు. చంద్రబాబు ఎప్పుడో పుష్కరాల నాటికి ఫ్లైఓవర్ పూర్తి చేస్తామని చెప్పి మాట తప్పారని ఆయన ఎద్దేవా చేశారు.

విజయవాడ అభివృద్ధిని చంద్రబాబు పూర్తిగా వదిలేశారని, విజయవాడకి కేంద్రం కేటాయించిన నిధులను కూడా టీడీపీ ప్రభుత్వం అమరావతికి మళ్లించిందని శ్రీనివాస్ దుయ్యబట్టారు.

అమరావతి అనే భ్రమరావతిలో ప్రజలను చంద్రబాబు ఉంచాడని.. కానీ వైసీపీ ప్రభుత్వం విజయవాడలో అభివృద్ది శరవేగంగా జరుగుతోందన్నారు. కేశినేని నాని, గద్దె రామ్మోహన్, ఇతర నాయకులు బెజవాడ అభివృద్ధి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారని శ్రీనివాసరావు మండిపడ్డారు.

అయితే గత ఐదేళ్లలో మాత్రం చంద్రబాబుతో నిధులు ఇప్పించుకోలేకపోయారని.. ఎల్‌ అండ్ టీ కంపెనీ ప్రతినిధులతో చర్చలంటూ హడావిడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి జగన్ ఏడాదిలోనే అన్నీ చేయాలని డిమాండ్ చేస్తున్నారని... గత ఐదేళ్లలో ఎంపీగా బెజవాడకు కేశినేని ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. ఇంట్లో తాగి పడుకున్న దద్దమ్మలు ఇప్పుడు తమ గురించి మాట్లాడుతున్నారని.. తెలుగుదేశం హయాంలో ప్రజాధనాన్ని దోచుకున్న ఎవరినీ చట్టం వదలదన్నారు.

అచ్చెన్నాయుడు కార్మికుల డబ్బును దోచుకున్నాడు కాబట్టే జైలుకెళ్లాడని.. అదే విధంగా ఎవరు అక్రమాలు చేసినట్లు తమ దృష్టికి వచ్చినా చర్యలు తప్పవని వెల్లంపల్లి శ్రీనివాసరావు హెచ్చరించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి... ఈ తెలుగు జిల్లాల్లో రిపబ్లిక్ డే కూడా వర్షాలే
Deputy CM Pawankalyan: నాందేడ్ గురుద్వారా లో హిందీలో పవన్ పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu