తిరుపతిలో బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారంపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు.ఆ టిక్కెట్లు టీడీపీ హాయంలో చోటు చేసుకొన్నవేనని ఆయన చెప్పారు.
అమరావతి:తిరుమలలో అన్యమత ప్రచారంపై ఏపీ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. ఈ టిక్కెట్లను టీడీపీ ప్రభుత్వ హయంలోనే ముద్రించారని ఆయన స్పష్టం చేశారు.
తిరుమలకు వెళ్లే బస్సులో అన్యమతానికి ప్రచారం చేసే యాడ్ లు ముద్రించిన టిక్కెట్లు జారీ చేయడం వివాదంగా మారింది.
ఈ విషయమై శుక్రవారం నాడు ఏపీ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటన విడుదల చేశారు.
నెల్లూరు డిపోలో ఉండాల్సిన టిక్కెట్లు తిరుపతి డిపోకు వెళ్లినట్టుగా అధఇకారులు గుర్తించారన్నారు.ఈ విషయమై విచారణకు ఆదేశించామన్నారు. బాధ్యులపై చర్యలు కూడ తీసుకొంటామని ఆయన ప్రకటించారు.
రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా కూడ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి అపాదించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ దురుద్దేశ ప్రచారం ద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఈ తరహా విషప్రచారానికి పాల్పడుతున్న మీడియా సంస్థలు, వ్యక్తులపై చర్యలకు పాల్పడుతామని ఆయన హెచ్చరించారు. తిరుమల ప్రతిష్టను, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించే వారిపై చట్ట ప్రకారంగా వ్యవహరిస్తామన్నారు.
ఈ టిక్కెట్లను చంద్రబాబునాయుడు ప్రభుత్వం హాయంలోనే ముద్రించారని ఆయన గుర్తు చేశారు.ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఈ టెండర్లను కట్టబెట్టిందన్నారు.
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో చోటు చేసుకొన్న విషయాలను ఆయన ఆ ప్రకటనలో వివరించారు.అందరిని అక్కున చేర్చుకొన్నందునే జగన్ సీఎం అయ్యారన్నారు. అందరూ దూరం పెట్టడం వల్లే చంద్రబాబు అధికారినికి దూరమయ్యారని ఆయన చెప్పారు.
సంబంధిత వార్తలు
తిరుమలలో అన్యమత ప్రచారం: ప్రభుత్వం సీరియస్
తిరుమల కొండపై వివాదం: ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రకటనలు