బిజేపి, జనసేన పార్టీ ఎక్కడ ఉందో వాళ్లే వెతుక్కోవాలని... టిడిపి, బిజేపి కలిపి జగనన్న ప్రభుత్వాని కావాలనే ఇబ్బంది పెడుతున్నారన్నారని మంత్రి వెల్లంపల్లి ఆరోపించారు.
విజయవాడ: ప్రస్తుతం జరుగుతున్న స్థానికసంస్థల ఎన్నికల్లో టిడిపిపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత కనబడుతుందని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఈ పరిస్థితిని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో తర్వలోనే తెలుగుదేశం పార్టీ ఖాళీ అయ్యేలా కనిపిస్తోందని మంత్రి అభిప్రాయపడ్డారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో శుక్రవారం 41వ డివిజన్ స్వాతి సెంటర్ మసీదు రోడ్డు వద్ద నుంచి మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తన పర్యటన ప్రారంభించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రజల్లో టిడిపిపై పూర్తి వ్యతిరేకత కనబడుతుందన్నారు. 2 సంవత్సరాలుగా బయటకు రాకుండా ఎన్నికల వేళ టిడిపి నాయకులు ఆడుతున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.
undefined
read more దుర్గగుడిలో ఏసీబీ సోదాల్లో కీలక మలుపు:జనసేన అధికార ప్రతినిధికి ఏసీబీ పిలుపు
బిజేపి, జనసేన పార్టీ ఎక్కడ ఉందో వాళ్లే వెతుక్కోవాలన్నారు. టిడిపి, బిజేపి కలిపి జగనన్న ప్రభుత్వాని కావాలనే ఇబ్బంది పెడుతున్నారన్నారని ఆరోపించారు. ప్రజలకు భరోసా ఇవ్వని పార్టీ టిడిపినే అన్నారు. ఇప్పటికే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులకు ప్రజలు అదరించారన్నారు.
ఈ రోజు అంగరంగ వైభవంగా అంతర్వేది రథం సీఎం చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందన్నారు. అంతర్వేది రథం దగ్దం సంఘటనపై సీబిఐ దర్వాప్తకు రాష్ట్ర బిజేపి నాయకులు ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు... మౌనం వెనుక అర్థం ఏమిటి? అని వెల్లంపల్లి ప్రశ్నించారు.