కోడ్ ఉల్లంఘన కేసులో కోడెలకు చుక్కెదురు

Published : Oct 04, 2018, 12:29 PM IST
కోడ్ ఉల్లంఘన కేసులో కోడెలకు చుక్కెదురు

సారాంశం

ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు  కోర్టులో చుక్కెదురైంది.


హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు  కోర్టులో చుక్కెదురైంది.  కోడ్ ఉల్లంఘన కేసులో అక్టోబర్ 10వ తేదీన కోర్టుకు హాజరుకావాలని  ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక  కోర్టు గురువారం నాడు  ఆదేశాలు జారీ చేసింది.

ఏపీ అసెంబ్లీ స్పీకర్  కోడెల శివప్రసాదరావు ఓ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  తాను 2014 ఎన్నికల సమయంలో  రూ.11.50 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారని  పిటిషనర్  కోర్టుకు  వివరించారు.ఆ ఇంటర్వ్యూలో  కోడెల శివప్రసాదరావు  చెప్పిన అంశాలను పిటిషనర్  కోర్టుకు ఆధారాలతో సహా వివరించారు

ఈ కేసు విషయమై  కోర్టుకు హాజరుకావాలని స్పీకర్ కోడెలను  కోర్టు ఆదేశించింది. దీంతో  కోర్టుకు హాజరుకావాల్సిందేనని కోడెలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే  ఈ విషయమై స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.

PREV
click me!

Recommended Stories

YS Jagan Pressmeet: చంద్రబాబు, పవన్ పై జగన్ సంచలన కామెంట్స్ | Asianet News Telugu
Andhra pradesh: ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి రావాల‌ని జ‌గ‌న్ ఎందుకు కోరుకుంటున్నారు.? ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్