బారా షహీద్ దర్గాకు మంత్రి సోమిరెడ్డి..చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని మెుక్కు

By Nagaraju TFirst Published Sep 21, 2018, 5:16 PM IST
Highlights

రొట్టెల పండుగ సందర్భంగా బారా షహీద్ దర్గాను ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సందర్శించారు. దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ రొట్టెను పట్టారు మంత్రి సోమిరెడ్డి. 

నెల్లూరు: రొట్టెల పండుగ సందర్భంగా బారా షహీద్ దర్గాను ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సందర్శించారు. దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ రొట్టెను పట్టారు మంత్రి సోమిరెడ్డి. ఆ తర్వాత స్వర్ణాల చెరువులో బోటు షికారు చేశారు. బోటులో ప్రయాణికులతో మాట్లాడి వసతులపై ఆరా తీశారు.  

మతసామరస్యానికి ప్రతీక రొట్టెల పండగ అని మంత్రి సోమిరెడ్డి అన్నారు. ఈ రొట్టెల పండుగలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు తరలివస్తారన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు రొట్టెల పండగకు హాజరై రాష్ట్ర పండుగగా ప్రకటించారని సోమిరెడ్డి గుర్తు చేశారు. 

డీపీఆర్ సిద్ధమైతే బారా షహీద్ దర్గా ఆవరణలో మరిన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. దర్గా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. నాలుగు రోజుల పాటు సుమారు 18 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో అందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భక్తులకు అన్ని వసతులు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గట్టి బందోబస్తు ఏర్పాటు చేసతున్నామని అలాగే పారిశూధ్య ఏర్పాట్లు కూడా మెరుగ్గా ఉన్నాయన్నారు.  

click me!