విభజన నష్టం నుంచి ఏపీ తేరుకోలేదు: చంద్రబాబు

Published : Sep 21, 2018, 04:30 PM IST
విభజన నష్టం నుంచి ఏపీ తేరుకోలేదు: చంద్రబాబు

సారాంశం

15వ ఆర్థిక సంఘం ద్వారావ ఏపీకి న్యాయం జరిగేలా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. అమరావతిలో ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమైన చంద్రబాబు 15వ ఆర్థిక సంఘానికి అందించే వినతిపై అధికారులతో సమీక్షించారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా అయినా ఏపీకి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. 

అమరావతి: 15వ ఆర్థిక సంఘం ద్వారావ ఏపీకి న్యాయం జరిగేలా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. అమరావతిలో ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమైన చంద్రబాబు 15వ ఆర్థిక సంఘానికి అందించే వినతిపై అధికారులతో సమీక్షించారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా అయినా ఏపీకి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. 

రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి జరిగిన అన్యాయం చక్కదిద్దాలని వినతిపత్రంలో కోరాలని చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. 58.32 శాతం జనాభా 46శాతం ఆదాయం ఉండేలా అసమాన విభజన నష్టం ఇంకా పూడ్చలేదన్నారు. విభజన నష్టం నుంచి నాలుగున్నరేళ్లయినా ఆంధ్రప్రదేశ్ తేరుకోలేదని తెలిపారు. 

నాలుగున్నరేళ్లయినా ఏపీ పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చెయ్యలేదని ఈ అంశాలను పొందుపరచాలని అధికారులకు సీఎం ఆదేశించారు. మరోవైపు అక్టోబర్ 9,10,11 తేదీలలో ఆర్థిక సంఘం ప్రతినిధులు రాష్ట్రంలో పర్యటించనున్నట్లు చంద్రబాబు తెలిపారు.  

PREV
click me!

Recommended Stories

Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?
IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!