త్వరలో 3840 అపార్టుమెంట్ల నిర్మాణం

First Published Dec 11, 2017, 12:25 PM IST
Highlights
  • రాజధాని నిర్మాణం సంగతి ఎలాగున్నా ఎంఎల్ఏలు, ఉన్నతాధికారులకు మాత్రం క్వర్టర్స్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించేసింది.

రాజధాని నిర్మాణం సంగతి ఎలాగున్నా ఎంఎల్ఏలు, ఉన్నతాధికారులకు మాత్రం క్వర్టర్స్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించేసింది. సోమవారం ఉదయం రాజధాని పరిధిలోని రాయపూడి గ్రామంలో మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ పర్యటించారు. ఎక్కడెక్కడ ఎవరికి క్వార్టర్లు కట్టించాలో పరిశీలించారు. అదే సంద్రభంగా మీడియాతో మాట్లాడుతూ,  రాజధానిలో 3,840 అపార్టుమెంట్లు  నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఏడాదిలో  85 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 61 టవర్ల నిర్మాణం చేస్తామన్నారు. ఎమ్యెల్యేలకు 12 అపార్ట్‌మెంట్లలో  432 ఫ్లాట్స్ నిర్మిస్తామన్నారు. అదే విధంగా ఐఏఎస్ అధికారులకు 132 ఫ్లాట్స్ నిర్మిస్తున్నామన్నారు. రాజధాని పరిధిలో 10 గ్రామాల్లో పేదలకు 5 వేల ఇళ్ల నిర్మాణం కూడా చేపడుతున్నట్లు చెప్పారు.  వాస్తు సమస్యలు తలెత్తకుండానే  రైతులకు ప్లాట్లు అందజేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

click me!