విజన్ ఉంది.. విస్తరాకుల కట్ట ఉందని అంటాడు.. : చంద్రబాబుపై మంత్రి రోజా ఫైర్

Published : Jul 09, 2023, 02:51 PM IST
విజన్ ఉంది.. విస్తరాకుల కట్ట ఉందని అంటాడు.. : చంద్రబాబుపై మంత్రి రోజా ఫైర్

సారాంశం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. విజన్ ఉంది, విస్తరాకుల కట్ట ఉందని చెప్పిన చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్‌కు చేసింది చెప్పమంటే ఏమి ఉందని ఎద్దేవా  చేశారు. 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. విజన్ ఉంది, విస్తరాకుల కట్ట ఉందని చెప్పిన చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్‌కు చేసింది చెప్పమంటే ఏమి ఉందని ఎద్దేవా  చేశారు. గండికోట‌లో ఒబెరాయ్ హోట‌ల్ నిర్మాణ ప‌నుల‌కు సీఎం వైఎస్ జ‌గ‌న్ ఈ రోజు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రోజా మాట్లాడుతూ.. ‘‘విజన్ ఉంది, విస్తరాకుల కట్ట ఉంది అని ఒకాయన చెప్తాడు.. సెల్‌ఫోన్ కనిపెట్టాను.. కంప్యూటర్‌‌ కనిపెట్టానని అంటాడు తప్ప ఏపీకి ఏం చేశావయ్య అంటే మాత్రం చెప్పడానికి ఏం ఉండదు’’ అని విమర్శలు గుప్పించారు. 

విజన్ అంటే సీఎం జగన్‌ది అని అన్నారు. మనసున్న నాయకుడు కాబట్టే.. అభివృద్దితో పాటు.. ప్రజలకు కూడా ఆర్థికంగా సపోర్ట్‌గా ఉంటున్నారని అన్నారు.  పని మనుషులు, డ్రైవర్లతో ఎంవోయూలు చేసుకున్న ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు. బాబు పాలనలో లిక్కర్ ఫ్యాక్టరీలే పారిశ్రామిక ప్రగతి అని డబ్బా కొట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. 

తాము నిజమైన పారిశ్రామికవేత్తలతో రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని రోజా చెప్పారు. సీఎం జగన్‌పై నమ్మకంతో బడా పారిశ్రామిక వేత్తలు ఏపీకి క్యూ కడుతున్నారని అన్నారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయంటూ ఎల్లో మీడియా తప్పుడు ప్రచార చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ది కోసం సీఎం జగన్ చాలా కష్టపడుతున్నారని తెలిపారు. ప్రతి కుటుంబాన్ని ఉన్నత స్థితిలోకి తేవాలనేదే సీఎం జగన్ ఆలోచన అని అన్నారు. పారిశ్రామిక రంగంతో పాటు పర్యాటక రంగానికి కూడా సీఎం జగన్ పెద్ద పీట వేశారని చెప్పారు. 

ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పర్యాటక రంగానికి రూ. 22 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని రోజా చెప్పారు. ఎంవోయూలే కాదు.. పనులు కూడా చేసి చూపిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో జగన్ పాలన చూసి ప్రతి ఒక్కరు శభాష్ అంటున్నారని రోజా అన్నారు. వైఎస్ జగన్ అంటే నేమ్ కాదు.. బ్రాండ్ అని పేర్కొన్నారు. రికార్డు సృష్టించాలన్నా, బద్ధలు కొట్టాలన్నా జగన్‌కే సాధ్యమని అన్నారు. 175 నియోజకవర్గాల్లో వైసీపీని గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రజలంతా.. 2024లో జగనన్న వన్స్‌మోర్ అని అంటున్నారని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

AP Minister Ramprasad Reddy Lays Foundation for ₹19 Crore Works in Vijayawada | Asianet News Telugu
APCPDCL హెడ్ఆఫీస్ప్రారంభంలోMinister Gottipati Ravi Kumar | APCPDCL Head Office | Asianet News Telugu