తొడగొట్టి పిలిచారు కదా.. కొడాలి నాని, వల్లభనేని వంశీ వస్తే ఎందుకు పారిపోయారు?: మంత్రి రోజా

Published : Jun 11, 2022, 10:05 AM IST
తొడగొట్టి పిలిచారు కదా.. కొడాలి నాని, వల్లభనేని వంశీ వస్తే ఎందుకు పారిపోయారు?: మంత్రి రోజా

సారాంశం

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ పర్యాటక మంత్రి ఆర్కే రోజా శనివారం దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ పర్యాటక మంత్రి ఆర్కే రోజా శనివారం దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు, లోకేష్ వైఖరి కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్టుగా ఉందని విమర్శించారు. గడపగడపకు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. ప్రజలకు మంచి జరుగుతుంటే చంద్రబాబు, లోకేష్ తట్టుకోలేకపోతున్నారని అన్నారు. పదో తరగలి పరీక్ష ఫలితాలపై టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. మహానాడులో తొడగొట్టి రమ్మని పిలిచిన టీడీపీ నాయకులు.. లోకేష్‌ జూమ్ మీటింగ్‌కు కొడాలి నాని, వల్లభనేని వంశీ వస్తే ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. కోవిడ్ కారణంగా పిల్లలు సరిగా చదువుకోకపోవడం వల్లే ఉత్తీర్ణత తగ్గిందన్నారు. 

లోకేష్ జీవితంలో అసెంబ్లీలోకి రాలేడని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోతే టీడీపీని మూసేస్తామని అచ్చెన్నాయుడు పదే పదే చెబుతున్నారని.. అయితే 2019 నుంచి రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికలు టీడీపీ ఓడిపోతోందని మంత్రి రోజా అన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ‌బస్సు యాత్ర ఎందుకు చేస్తున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు మద్దతు ఇవ్వడానికే పవన్ కళ్యాణ్ పాకులాడుతుంటారని విమర్శించారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!