వచ్చే ఎన్నికల్లో మీకు 70 ఎంఎం స్క్రీన్‌పై సినిమానే : బాబు, లోకేష్‌లపై రోజా వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : May 21, 2022, 09:26 PM IST
వచ్చే ఎన్నికల్లో మీకు 70 ఎంఎం స్క్రీన్‌పై సినిమానే : బాబు, లోకేష్‌లపై రోజా వ్యాఖ్యలు

సారాంశం

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్‌లకి సీఎం జగన్ 70 ఎంఎం స్క్రీన్‌పై సినిమా చూపిస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి రోజా. ధరల పెరుగుదలపై నరేంద్ర మోడీని చంద్రబాబు ఎందుకు తిట్టడం లేదని మంత్రి నిలదీశారు. 

ప్రతిపక్షనేత, టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడుపై (chandrababu naidu) మంత్రి ఆర్‌కే రోజా (rk roja) విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు ప్రచారానికి ప్రజల్లో స్పందన లేదని.. ఏపీలో మాత్రమే ధరలు పెరగలేదని, దేశమంతా పెరిగాయని ఆమె చురకలు వేశారు. ధరల పెంపుపై చంద్రబాబు మోడీని (narendra modi) ఎందుకు తిట్టడం లేదని రోజా ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్‌కి (nara lokesh) వచ్చే ఎన్నికల్లో 70 ఎంఎంలో జగన్ (ys jagan) సినిమా చూపిస్తారంటూ మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఇకపోతే.. ఇటీవల మంత్రి రోజా తిరుపతిలో సందడి చేశారు.  లండన్ బ్యూటోరియం బ్రాంచ్ ను ప్రారంభించిన రోజా తెగ హడావిడి చేశారు. పార్లర్ లో కలియతిరుగుతూ... అక్కడ మహిళలకు అందించబోయే సేవల గురించి తెలుసుకున్నారు. అంతేకాదు స్వయంగా బ్లూటీ పార్లర్ కు చెందిన ప్రొఫెషనల్ తో నెయిల్ కటింగ్ చేయించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు రోజా.

చెన్నై బేస్డ్ లండన్ బ్యూటోరియం బ్రాంచ్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. తిరుపతిలోని మహిళలు అత్యుత్తమ బ్యూటీ సేవలను ఇక్కడ పొందవచ్చని తెలిపారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాదుల్లో లభించే నాణ్యమైన సేవలు ఇప్పుడు తిరుపతికి కూడా అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ఈ సందర్భంగా బ్యూటీ క్లినిక్ హెడ్ జీవిత సత్యనారాయణన్, బ్రాంచ్ ఓనర్ ప్రియాంకను ఆమె అభినందించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!
Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu