పెద్దాయన చావుకు కారణమై.. నేడు శత జయంతి ఉత్సవాలా : చంద్రబాబుపై రోజా వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Apr 28, 2023, 06:49 PM ISTUpdated : Apr 29, 2023, 01:30 AM IST
పెద్దాయన చావుకు కారణమై.. నేడు శత జయంతి ఉత్సవాలా : చంద్రబాబుపై రోజా వ్యాఖ్యలు

సారాంశం

అసెంబ్లీలో కనీసం ఎన్టీఆర్ మైక్‌ ఇవ్వకుండా ఆయన చావుకు చంద్రబాబు కారణమయ్యారని మంత్రి రోజా మండిపడ్డారు. గతంలో మోడీని తిట్టి.. ఇప్పుడు అదే నోటితో ఆయనను చంద్రబాబు పొగుడుతున్నారని రోజా ఎద్దేవా చేశారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు మంత్రి రోజా. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పేరు చెప్పుకుని మళ్లీ అధికారంలోకి రావాలని చంద్రబాబు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ జిల్లా అని చెప్పే చంద్రబాబు అధికారంలో వుండగా ఏం చేయలేదని రోజా దుయ్యబట్టారు. ఒక్క జిల్లాకు కానీ మండలానికి కానీ ఎన్టీఆర్ పేరు పెట్టలేదని ఆమె ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, పార్టీ గుర్తు, పార్టీని లాక్కొన్నారని రోజా ఆరోపించారు. అసెంబ్లీలో కనీసం ఎన్టీఆర్ మైక్‌ ఇవ్వకుండా ఆయన చావుకు చంద్రబాబు కారణమయ్యారని మంత్రి మండిపడ్డారు. ఇవన్నీ చేసి ఇప్పుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు చేయటం హాస్యాస్పదమన్నారు.

విపక్షంలో వున్నప్పుడే ఎన్టీఆర్ కుటుంబం చంద్రబాబుకి గుర్తొస్తారని .. అధికారంలోకి వచ్చాక వాళ్లని పట్టించుకోరని రోజా ఆరోపించారు. ఎన్టీఆర్ పుట్టిన గడ్డకు ఆయన పేరును పెట్టిన వ్యక్తి జగన్ అని మంత్రి ప్రశంసించారు. గతంలో మోడీని తిట్టి.. ఇప్పుడు అదే నోటితో ఆయనను చంద్రబాబు పొగుడుతున్నారని రోజా ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన అవసరం కోసం ఏదైనా చేస్తారని.. జగన్ పథకాలను తానూ అమలు చేస్తానని చెప్పడం ద్వారా ఆయన పాలన బాగుందని ఒప్పుకున్నట్లేననని రోజా అన్నారు. 

ఇకపోతే.. సూపర్ స్టార్ రజనీకాంత్‌కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తేనీటి విందు ఇచ్చారు. విజయవాడ పోరంకిలోని అనుమోలు గార్డెన్స్ లో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరయ్యేందుకు రజనీకాంత్ ఈ రోజు ఉదయం నగరానికి వచ్చారు. విజయవాడ చేరుకున్న రజనీకాంత్‌కు ఎన్టీఆర్ తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్వాగతం పలికారు. బాలయ్యను చూడగానే సూపర్‌స్టార్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. పలువురు టీడీపీ నేతలు కూడా రజనీకాంత్‌కు స్వాగతం పలికినవారిలో ఉన్నారు. అనంతరం ఇద్దరు నోవోటెల్‌కు చేరుకున్నారు. అక్కడ బాలకృష్ణ, రజనీకాంత్‌లు కాసేపు సమావేశమయ్యారు. 

ALso Read: దళితుల కోసం ఒక్క పథకమైనా తెచ్చారా? : జగన్ ను ప్రశ్నించిన చంద్రబాబు

అనంతరం బాలకృష్ణ, రజనీకాంత్‌లు ఒకే కారులో నోవోటెల్‌కు చేరుకున్నారు. అక్కడ బాలకృష్ణ, రజనీకాంత్‌లు కాసేపు సమావేశమయ్యారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరయ్యేందుకు విజయవాడకు విచ్చేసిన  రజనీ కాంత్‌ను చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసానికి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే రజనీకాంత్ చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. అక్కడ రజనీకాంత్‌కు సాదర స్వాగతం పలికిన చంద్రబాబు.. తేనీటి  విందు ఇచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణతో పాటు పలువురు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరుకానున్న సీనియర్ జర్నలిస్టు వెంకటనారాయణ కూడా చంద్రబాబు నివాసానికి వచ్చారు. 

ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాల పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో రజనీకాంత్ విశిష్ట అతిథిగా పాల్గొననున్నారు. ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలపై ఈరోజు రెండు పుస్తకాల విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు.


 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్