అది వారాహి కాదు నారాహి.. దమ్ముంటే ఆ పని చేయి..: పవన్ కల్యాణ్‌కు రోజా చాలెంజ్

By Sumanth KanukulaFirst Published Dec 10, 2022, 3:34 PM IST
Highlights

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి రోజా మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ ప్రచార వాహనం గురించి రోజా మాట్లాడుతూ.. అది వారాహి కాదు  నారాహి అంటూ విమర్శించారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి రోజా మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ ప్రచార వాహనం గురించి రోజా మాట్లాడుతూ.. అది వారాహి కాదు  నారాహి అంటూ విమర్శించారు. శనివారం తిరుపతిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ సమీకృత సుస్థిర పర్యాటక ప్రణాళిక అభివృద్ధిపై  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా ఏపీ ప్రాంతీయ విభాగం, ఏపీ టూరిజం ఆథారిటీ ఆధ్వర్యంలో జరిగిన సౌత్ జోన్ సదస్సులో రోజా పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ కత్తులతో ఎవరిపై యుద్ధం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాడన్నారు. కత్తులు పట్టుకుని పిచ్చి ట్వీట్లు చేయడం రాజకీయాల్లో సరైన పద్దతి కాదని అన్నారు. 

పవన్‌ కల్యాణ్ ఆయను చూసి తాము భయపడుతున్నామని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాము యుద్దానికి రెడీ అని.. ప్రజాక్షేత్రంలో తమ నాయకుడు ఎప్పుడూ యుద్దానికి సిద్దంగా ఉంటారని చెప్పారు. పవన్ కల్యాణ్‌కు దమ్ముంటే.. జనసేను నుంచి 175 మంది అభ్యర్థులను బరిలో నిలపాలని సవాలు చేశారు. ఎవడి సైన్యంలోనో దూరి దొంగ దెబ్బ తీయాలంటే తాము భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. 

చంద్రబాబుకు కరకట్ట మీద ఇళ్లు ఇచ్చిన లింగమనేని.. జనసేనకు కూడా పార్టీ ఆఫీసు ఇచ్చారని అన్నారు. తాము ఏమైనా ఇవ్వొద్దని చెప్పామా అని ప్రశ్నించారు. ఇప్పటంలో పవన్ కల్యాణ్ వాహనం మీద కాలు చాపుకుని రౌడీలా  వ్యవహించారని.. ఒక బాధ్యత గల నాయకుడు అలా వ్యవహరిస్తారా? అని ప్రశ్నించారు. పవన్‌కు పార్టీ మీద గానీ, రాష్ట్రం మీద గానీ, ప్రజల మీద గానీ ప్రేమ లేదని విమర్శించారు. పవన్‌కు చంద్రబాబు మీద, ప్యాకేజ్ మీదే ప్రేమ ఉందని ఆరోపించారు. 

హైదరాబాద్‌లో బతికే పవన్ శ్వాస తీసుకోవాలా వద్దా? అనేది చెప్పాల్సింది కేసీఅర్, కేటీఆర్ అని రోజా అన్నారు. పవన్ కల్యాణ్ వాహనంపై చర్చ పెట్టింది మీడియా అని అన్నారు. ఈ కలర్ వాహనం ఇక్కడ రిజిస్టర్ అవుతుందా? లేదా?.. ఆ చట్టం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అని అన్నారు. తాము పవన్‌ కల్యాణ్‌ను ఆపుతామని ఎక్కడ చెప్పలేదని అన్నారు. సీఎం జగన్‌కు పిచ్చి పిచ్చి వాటి గురించి ఆలోచించే సమయం లేదని, ఇలాంటి వాళ్లకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. 2024లో వైసీపీ 175 స్థానాల్లో విజయం సాధిస్తుందని 

గల్లా అరుణ ఫ్యామిలీ పరిశ్రమను తెలంగాణలో విస్తరించుకుంటే.. తాము ఏదో తరిమేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వాళ్లకు అనేక రాష్ట్రాల్లో పెట్టుబడులు ఉన్నాయని అన్నారు. చంద్రబాబు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. హెరిటేజ్ 15 వేల కోట్ల రూపాయలను హైదరాబాద్‌లో ఇన్వెస్ట్ చేసిందని.. అంటే భువనేశ్వరి, బ్రాహ్మణిలకు నమ్మకం లేక హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టారా? అని ప్రశ్నించారు. లేకపోతే చంద్రబాబు ప్రభుత్వం తరిమిస్తే వెళ్లిపోయారా? అనే దానికి కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 
 

click me!