జీవీఎల్‌ను కాలుతో తన్నిన ఆవు.. నమస్కరించేందుకు వెళ్లిన సమయంలో ఘటన..

Published : Dec 10, 2022, 02:46 PM IST
జీవీఎల్‌ను కాలుతో తన్నిన ఆవు.. నమస్కరించేందుకు వెళ్లిన సమయంలో ఘటన..

సారాంశం

బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహా రావుకు ఊహించని పరిస్థితి ఎదురైంది. ఆవుకు నమస్కరించేందుకు దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. అది ఆయనను తన్నింది. 

బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహా రావుకు ఊహించని పరిస్థితి ఎదురైంది. ఆవుకు నమస్కరించేందుకు దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. అది ఆయనను తన్నింది. వివరాలు.. జీవీఎల్ శనివారం గుంటూరులో మిర్చి ఎగుమతి దారుల అసోసియేషన్ కార్యాలయం ప్రారంభించేందుకు వచ్చారు. అయితే గృహప్రవేశం కోసం తీసుకొచ్చిన  ఆవుకు నమస్కరించేందుకు జీవీఎల్ దగ్గరగా వెళ్లారు. అయితే ఆవు వెనకకాలుతో జీవీఎల్‌ను తన్నింది. అయితే రెండోసారి కొద్ది  దూరంలో ఉండి నమస్కరించేందుకు ప్రయత్నం చేయగా.. మరోసారి గోవు తన్నేందుకు కాలు లేపింది. దీంతో అక్కడివారు ఆయనను వెంటనే వెనక్కి జరిపారు. ఆ తర్వాత ఎంపీ జీవీఎల్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!