నాలుక అదుపులో పెట్టుకో: మాజీ ఎంపీ హర్షకుమార్‌కు మంత్రి విశ్వరూప్ వార్నింగ్

Siva Kodati |  
Published : Jul 24, 2020, 04:15 PM ISTUpdated : Jul 24, 2020, 04:24 PM IST
నాలుక అదుపులో పెట్టుకో: మాజీ ఎంపీ హర్షకుమార్‌కు మంత్రి విశ్వరూప్ వార్నింగ్

సారాంశం

మాజీ ఎంపీ హర్షకుమార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి పినిపే విశ్వరూప్. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కాళ్ల మీద పడినప్పుడే హర్షకుమార్ విలువ దిగజారిపోయిందంటూ ఎద్దేవా చేశారు

మాజీ ఎంపీ హర్షకుమార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి పినిపే విశ్వరూప్. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కాళ్ల మీద పడినప్పుడే హర్షకుమార్ విలువ దిగజారిపోయిందంటూ ఎద్దేవా చేశారు.

దళితుల పుట్టుక గురించి దారుణంగా మాట్లాడుతున్నారు. నాలుక జాగ్రత్త పెట్టుకో అంటూ విశ్వరూప్ హెచ్చరించారు. మాట్లాడితే దళిత పులి అని చెప్పుకునే హర్షకుమార్.. తన రాజకీయ భవిష్యత్తు కోసం జాతిని ఎంతకైనా తాకట్టు పెడతారని విశ్వరూప్ ఆరోపించారు.

ముఖ్యమంత్రి జగన్ దళితులకు అన్ని రకాలుగా పెద్ద పీట వేశారని.. దళితుడు వరప్రసాద్ కేసులో సీఎం వెంటనే స్పందించారని మంత్రి గుర్తుచేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల కారణంగానే పోలీసులు నిందితులను పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారని విశ్వరూప్ అన్నారు. ఇప్పటికైనా హర్షకుమార్ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని మంత్రి హితవు పలికారు. 

Also Read:జగన్‌పై మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్ర వ్యాఖ్యలు

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే