విజయవాడలో భారీ చోరీ: పోలీసులు అదుపులో నలుగురు

By narsimha lodeFirst Published Jul 24, 2020, 3:56 PM IST
Highlights

విజయవాడ వన్ టౌన్ సాయిచరణ్  జ్యూయలరీ షాపులో దోపీడీకి పాల్పడిన నిందితులను పోలీసులు ప్రకాశం బ్యారేజీ వద్ద శుక్రవారంనాడు అరెస్ట్ చేశారు. ఈ దుకాణంలో పనిచేసే ఉద్యోగి విక్రం సింగ్ కు ఈ దోపీడీకి కూడ సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.


విజయవాడ: విజయవాడ వన్ టౌన్ సాయిచరణ్  జ్యూయలరీ షాపులో దోపీడీకి పాల్పడిన నిందితులను పోలీసులు ప్రకాశం బ్యారేజీ వద్ద శుక్రవారంనాడు అరెస్ట్ చేశారు. ఈ దుకాణంలో పనిచేసే ఉద్యోగి విక్రం సింగ్ కు ఈ దోపీడీకి కూడ సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

ప్రకాశం బ్యారేజీ కృష్ణవేణిఘాట్ వద్ద నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దోపీడీకి పాల్పడే సమయంలో విక్రంసింగ్ పై నిందితులు దాడి చేశారు. విక్రంసింగ్ కూడ రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవాడు. రెండు మాసాల క్రితమే విజయవాడ వన్ టౌన్ సాయిచరణ్ జ్యూయలరీ షాపులో పనికి చేరాడు.

also read:విజయవాడలో భారీ దోపీడీ: సాయి చరణ్ జ్యూయలరీ షాపులో 7 కిలోల బంగారం, రూ. 30 లక్షల చోరీ

ఇవాళ ఉదయం దుకాణం యజమాని బయటకు వెళ్లిన తర్వాత నిందితులు విక్రంసింగ్ పై దాడి చేసి దోచుకొన్నారు. కార్యాలయంలోని సీసీ పుటేజీ రికార్డు చేసే డీవీఆర్ ను కూడ తీసుకెళ్లి కాలువలో పారేశారు.

దోపీడీకి పాల్పడిన వ్యక్తులు రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవారు. ఈ దోపీడీ వెనుక విక్రంసింగ్ హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విక్రంసింగ్ ను కూడ పోలీసులు విచారణ చేసే అవకాశం ఉంది.
 

click me!