ఆయనపై రాళ్లు వేయించావ్.. అమిత్ షా దగ్గరికెళ్తే అవన్నీ అడగరా: చంద్రబాబుపై పేర్ని నాని మండిపాటు

Siva Kodati |  
Published : Oct 21, 2021, 02:57 PM ISTUpdated : Oct 21, 2021, 03:18 PM IST
ఆయనపై రాళ్లు వేయించావ్.. అమిత్ షా దగ్గరికెళ్తే అవన్నీ అడగరా: చంద్రబాబుపై పేర్ని నాని మండిపాటు

సారాంశం

36 గంటల దీక్ష (chandrababu deeksha)పేరుతో కొంగ జపాన్ని మొదలుపెట్టారంటూ టీడీపీ (tdp) అధినేత చంద్రబాబుపై (chandrababu naidu) సెటైర్లు వేశారు మంత్రి పేర్నినాని (perni nani).  మా నాయకుడు ఆపుతున్నాడు కాబట్టే మీ ఆగడాలు సాగుతున్నాయని మంత్రి దుయ్యబట్టారు. మీ రౌడీ మూకలతో మళ్లీ అవే మాటలు మాట్లాడిస్తావా అంటూ చంద్రబాబుపై మండిపడ్డారు.

36 గంటల దీక్ష (chandrababu deeksha)పేరుతో కొంగ జపాన్ని మొదలుపెట్టారంటూ టీడీపీ (tdp) అధినేత చంద్రబాబుపై (chandrababu naidu) సెటైర్లు వేశారు మంత్రి పేర్నినాని (perni nani). గురువారం ఆయన తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. దీక్ష ఎవరి కోసం ఆయన నాని ప్రశ్నించారు. మా నాయకుడు ఆపుతున్నాడు కాబట్టే మీ ఆగడాలు సాగుతున్నాయని మంత్రి దుయ్యబట్టారు. మీ రౌడీ మూకలతో మళ్లీ అవే మాటలు మాట్లాడిస్తావా అంటూ చంద్రబాబుపై మండిపడ్డారు.

అమిత్ షాపై (amit shah) అల్లరిమూకలను ఎగదోసినప్పుడు ఆర్టికల్ 356 (article 356) గుర్తుకు రాలేదా అని పేర్ని నాని ప్రశ్నించారు. నీ కర్మకాలి అమిత్ షా దగ్గకు నువ్వు వెళ్తే ఇవన్నీ అడగారా అంటూ ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబు రాజకీయ జీవితమంతా దగ, దోపిడీ, కుట్రలేనని పేర్ని నాని ఆరోపించారు. పట్టాభి (pattabhi) మాటలు రాసిచ్చిందే చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు. మీరు రాష్ట్ర బంద్ ప్రకటిస్తే ఎవరైనా మద్ధతు ఇచ్చారా అని ఆయన మంత్రి సెటైర్ వేశారు. 

ALso Read:టీడీపీ గుర్తింపు రద్దుకై ఈసీకి ఫిర్యాదు చేస్తాం: సజ్జల రామకృష్ణారెడ్డి

2024లో కూడా చంద్రబాబుకు ఇదే పరిస్ధితి తప్పదని పేర్ని నాని జోస్యం చెప్పారు. ఈ వయసులో ఇన్ని కుట్రలు అవసరమా.. అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీని ముంచడానికి ఎవరు అవసరం లేదన్న ఆయన... అందుకు మీ కుమారుడు చాలు అంటూ సెటైర్లు వేశారు. వరుస ఓటములు చవిచూసినా.. చంద్రబాబులో మార్పు రాలేదంటూ మండిపడ్డారు. రాజకీయాల్లో ఎలాంటి సిద్ధాంతాలు లేని వ్యక్తి చంద్రబాబంటూ ఎద్దేవా చేశారు. ఈ చర్యలన్నీ లోకేశ్ (nara lokesh) అధికారం కోసం చంద్రబాబు చేస్తున్న చేతబడి అంటూ పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

2016లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ప్రజాసంఘాలు బంద్ కు పిలుపునిస్తే... రాష్ట్రంలో ఉత్పాదకత కుంటుపడుతుంది, అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది, రాష్ట్రంపై చెడుముద్ర పడుతుంది అంటూ చెప్పింది చంద్రబాబు కాదా? మరి ఇవాళ అదే చంద్రబాబు ఎందుకు బంద్ కు పిలుపునిచ్చినట్టు? అని మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దిక్కుమాలిన విపక్షనేతను కలిగి ఉండడం జగన్ దౌర్భాగ్యం అని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.

అంతకుముందు మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి టడీపీ గుర్తింపును రద్దు చేయాలని ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఏపీ సీఎం జగన్ పై బూతు పదాలతో దూషించిన టీడీపీని, చంద్రబాబును ప్రజలంతా  నిలదీయాలని Sajjala Ramakrishna Reddy కోరారు.జగన్ ఆపుతున్నారని అందుకే  కార్యకర్తలు సహనంగా ఉన్నారని ఆయన చెప్పారు. సహనానికి ఓ హద్దు ఉంటుందని చెప్పారు.టీడీపీ లైన్ దాటిందన్నారు.  ఏమైనా జరిగితే చంద్రబాబుదే బాధ్యతని ఆయన తెలిపారు. టీడీపీ కార్యాలయంపై  దాడి చేయడం తప్పే, కానీ ఆ ఆగ్రహానికి కారణం ఎవరని ఆయన ప్రశ్నించారు.బూతులు మాట్లాడే హక్కు కోసం టీడీపీ నేతలు ఉద్యమం చేస్తున్నారని  ఆయన ఎద్దేవా చేశారు.సభ్య సమాజంలో ఉండే హక్కును చంద్రబాబు, టీడీపీ కోల్పోయిందన్నారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్