వచ్చింది పరామర్శకా.. పాత లెక్కలు తేల్చుకోవడానికా: చంద్రబాబుపై పేర్ని నాని ఆగ్రహం

Siva Kodati |  
Published : Jul 14, 2021, 05:39 PM IST
వచ్చింది పరామర్శకా.. పాత లెక్కలు తేల్చుకోవడానికా: చంద్రబాబుపై పేర్ని నాని ఆగ్రహం

సారాంశం

చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో ఎన్ని నెరవేర్చారని ప్రశ్నించారు మంత్రి పేర్ని నాని. కృష్ణా జిల్లాలో ఈరోజు జరిగిన చంద్రబాబు నాయుడు పర్యటనపై మంత్రి విమర్శలు చేశారు.

ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు మచిలీపట్నం పర్యటనపై విమర్శలు గుప్పించారు మంత్రి పేర్నినాని. బుధవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని నాని అన్నారు. టీడీపీ అధినేత పరామర్శకు వచ్చి రాజకీయాలు మాట్లాడారని నాని ఎద్దేవా చేశారు. పరామర్శకు వచ్చారా.. పాత లెక్కలు తేల్చుకోవడానికి వచ్చారా అంటూ పేర్ని నాని నిలదీశారు.

Also Read:చంద్రబాబు టూర్‌లో జూ.ఎన్టీఆర్ జెండాలు: నెక్ట్స్ సీఎం అంటూ నినాదాలు

మాట ఇచ్చి తప్పడం చంద్రబాబు నైజమైతే.. మాట ఇస్తే మడమ తిప్పని చరిత్ర వైఎస్ కుటుంబానిదన్నారు. చంద్రబాబు 600 హామీలు ఇచ్చి ఎన్ని నేరవేర్చారని మంత్రి ప్రశ్నించారు. కాపులను బీసీల్లో, రజకులను ఎస్సీల్లో చేర్చారా అని నాని నిలదీశారు. గిరిజనులకు ఒక్క మంత్రి పదవి అయినా చంద్రబాబు ఇచ్చారా అని మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు నీళ్లిస్తే ప్రజలు ఎందుకు ఓడించారని నాని దుయ్యబట్టారు. ఐదేళ్లలో చంద్రబాబు ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారని మంత్రి నిలదీశారు. 

PREV
click me!

Recommended Stories

నన్ను సార్ అంటే చాక్లెట్ ఇవ్వాలి విద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Nara Lokesh Fun With Students
Nara Lokesh Speech: టీడీపీ కార్యకర్తలకు పూనకాలు తెప్పించే నారాలోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | TDP