నిరుద్యోగి ఆత్మహత్య... తల్లిదండ్రుల నారా లోకేష్ రూ.2లక్షల ఆర్థిక సాయం

By Arun Kumar PFirst Published Jul 14, 2021, 5:17 PM IST
Highlights

ప్రభుత్వోద్యోగం కోసం ప్రిపేర్ అవుతూ ఎంతకూ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరక్కపోవడంతో క‌ర్నూలు జిల్లా ప్యాపిలి మండ‌లం గోపాల‌న‌గ‌రంకి చెందిన నాగేంద్ర‌ప్ర‌సాద్ ఇటీవల ఆత్మ‌హ‌త్య‌ చేసుకోగా అతడి కుటుంబానికి నారా లోకేష్ ఆర్థిక సాయం అందించారు.

మంగళగిరి: బీఈడీ పూర్తిచేసి టీచ‌ర్ ఉద్యోగం సాధించాల‌నే క‌ల‌లు క‌ల్ల‌ల‌య్యాయ‌నే మ‌న‌స్తాపంతో ఇటీవల ఓ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. చేతికందివచ్చిన కొడుకు ఇలా అర్దాంతరంగా తనువు చాలించడంతో తీవ్ర దు:ఖంలో వున్న ఆ తల్లిదండ్రులకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అండగా నిలిచారు. 

వీడియో

ప్రభుత్వోద్యోగం కోసం ప్రిపేర్ అవుతూ ఎంతకూ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరక్కపోవడంతో క‌ర్నూలు జిల్లా ప్యాపిలి మండ‌లం గోపాల‌న‌గ‌రంకి చెందిన నాగేంద్ర‌ప్ర‌సాద్ ఇటీవల ఆత్మ‌హ‌త్య‌ చేసుకున్నాడు. అతడి కుటుంబం బుధవారం నారా లోకేష్ ని కలిచారు. బుధవారం మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాల‌యంలో లోకేష్ ని కలుసుకున్నారు నాగేంద్ర ప్రసాద్ తల్లిదండ్రులు జ‌య‌ల‌క్ష్మమ్మ‌,  గోపాల‌ప్ర‌సాద్. వారికి రూ.2 ల‌క్ష‌ల రూపాయ‌ల ఆర్థిక సాయాన్ని ప్రకటించిన లోకేష్ చెక్ ను కూడా అంద‌జేశారు.  

read more  ఇక పోరాటానికి సిద్దం కండి... కర్నూల్ జిల్లాలో నిరుద్యోగి ఆత్మహత్యపై లోకేష్ సీరియస్

ఆ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న త‌ల్లిదండ్రుల‌కి గుండెకోత మిగిల్చేలా ఇటువంటి త‌ప్పుడు నిర్ణ‌యాలు ఎవ్వ‌రూ తీసుకోవ‌ద్ద‌ని యువ‌త‌కి విన్నవించారు. అంతా క‌లిసి ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీ కోసం పోరాడ‌దామ‌ని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కంపెనీలు రాక‌, ఉన్న‌వి త‌ర‌లిపోయి ప్రైవేటు రంగంలోనూ ఉపాధి క‌రువైంద‌న్నారు. జాబ్ క్యాలెండ‌ర్ పేరుతో ప్ర‌భుత్వ‌మూ మోసం చేసింద‌ని ఆరోపించారు. ఉపాధి లేద‌ని ఉసురు తీసుకోవ‌డం ఏంట‌ని, ఉపాధి కోసం ఉద్య‌మ‌బాట ప‌ట్టాల‌ని...తానే ఉద్య‌మానికి ముందుండి న‌డుస్తాన‌ని లోకేష్ హామీ ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా నాగేంద్ర‌ప్ర‌సాద్ తల్లి మాట్లాడుతూ తనకు కలిగిన శోకం ఇక ఏ త‌ల్లికి కలగకూడదన్నారు. ప్ర‌భుత్వ ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌క‌పోవడం... ఎక్కడా ఉపాధి దొర‌క్క‌ నిరుద్యోగులు తీవ్ర‌నిరాశ‌లో వున్నార‌ని... వారికి అండ‌గా నిల‌వాల‌ని ఆమె లోకేష్‌ని కోరింది. 

click me!