జగన్ భోజనానికి పిలిచారు.. చిరంజీవి వెళ్లారు, అవి కుశల ప్రశ్నలే : పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

By Rajesh KFirst Published Jan 21, 2022, 7:34 PM IST
Highlights

చిరంజీవితో జరిగినవి సంప్రదింపులు కావు.. కుశల ప్రశ్నలు మాత్రమే అన్నారు మంత్రి పేర్ని నాని. సీఎం భోజనానికి పిలిచారు... చిరంజీవి వెళ్లారని చెప్పారు మంత్రి. జగన్ - చిరంజీవి సమావేశంలో తాను లేనని అన్నారు. సినిమా టికెట్లకు సంబంధించిన సంప్రదింపులు సచివాలయంలో జరుగుతాయి కానీ.. ఇంట్లో జరుగుతాయా అని ప్రశ్నించారు. 


చిరంజీవితో జరిగినవి సంప్రదింపులు కావు.. కుశల ప్రశ్నలు మాత్రమే అన్నారు మంత్రి పేర్ని నాని. సీఎం భోజనానికి పిలిచారు... చిరంజీవి వెళ్లారని చెప్పారు మంత్రి. జగన్ - చిరంజీవి సమావేశంలో తాను లేనని అన్నారు. సినిమా టికెట్లకు సంబంధించిన సంప్రదింపులు సచివాలయంలో జరుగుతాయి కానీ.. ఇంట్లో జరుగుతాయా అని ప్రశ్నించారు. 

కాగా.. ఏపీ సీఎంYs Jagan తో సినీ నటుడు Chiranjeevi జనవరి 13న భేటీ అయ్యారు. సుమారు గంట 20 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. Cinema పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. సీఎం జగన్ తో lunch భేటీ సందర్భంగా పలు అంశాలపై  చిరంజీవి  జగన్ మధ్య చర్చ జరిగింది. క్యాంప్ కార్యాలయానికి చిరంజీవి చేరుకోగానే ఇంట్లో నుండి బయటకు వస్తూ రండి ఆచార్య అంటూ జగన్ ఆప్యాయం గా పలకరించారు.

దీంతో చిరంజీని జగన్ పరస్పరం ఆత్మీయ ఆలింగనం చేసుకొన్నారు. సీఎం జగన్ ను  చిరంజీవి శాలువా కప్పి సన్మానించారు. తన వెంట తెచ్చిన బోకేను సీఎం కు అందించారు. చిరంజీవిని జగన్ తన వెంట ఇంట్లోకి తీసుకెళ్లారు. tollywood cinema సమస్యలను చిరంజీవి జగన్ దృష్టికి తీసుకెళ్లారు.మరోసారి సమావేశం కావాలని  ఈ భేటీ లో నిర్ణయం తీసుకొన్నారు. తర్వాత జరిగే మీటింగ్ లో సినీపరిశ్రమ, ఏపీ ప్రభుత్వానికి మధ్య వివాదానికి  వివాదానికి స్వస్తి పలకాని నిర్ణయం తీసుకొన్నారు.

సినీ పరిశ్రమ బిడ్డగానే సీఎం జగన్ తో సమావేశానికి వచ్చినట్టుగా చిరంజీవి చెప్పారు. సీఎం జగన్ ఆహ్వానం మేరకు ఆయనతో భేటీ కానున్నట్టుగా చిరంజీవి తెలిపారు. ఏపీ సీఎం జగన్ తో భేటీ కావడానికి ముందు గన్నవరం ఎయిర్‌పోర్టులో చిరంజీవి మీడియాతో మాట్లాడారు.
Andhra pradeshప్రభుత్వం ఇటీవల కాలంలో cinema టికెట్ల దరలను తగ్గించింది. సినిమా Tickets ధరలను తగ్గించడంపై సినీ పరిశ్రమలోని ప్రముఖులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.  అఖండ సినిమా సక్సెస్ మీట్ లో ఏపీ రాష్ట్రంలో సినీ పరిశ్రమ గోడును వినిపించుకొనేవారెవరున్నారని సినీ నటుడు బాలకృష్ణ ప్రశ్నించారు. Balakrishna వ్యాఖ్యలు చేసిన మరునాడే చిరంజీవితో జగన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.

అంతకుముందు ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపు విషయమై రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి Perni nani తో ప్రముఖ దర్శకుడు Ramgopal Varma భేటీ అయిన సంగతి తెలిసిందే.  ఈ సమావేశంలో పలు అంశాలపై ఈ భేటీలో చర్చించారు. తన అభిప్రాయాలను వర్మ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ వాదనను కూడా ఏపీ మంత్రి నాని రామ్‌గోపాల్ వర్మ దృష్టికి తీసుకొచ్చారు.

సినీ పరిశ్రమకు చెందిన సమస్యలపై ఎవరైనా తమతో చర్చించేందకు తాము సిద్దంగా ఉన్నామని మంత్రి నాని చెప్పారు. రామ్‌గోపాల్ వర్మ మాదిరిగానే ఎవరైనా వచ్చి తమ అభిప్రాయాలను నిరభ్యంతరంగా ప్రభుత్వానికి చెప్పొచ్చన్నారు. రాష్ట్రంలో సినిమా టికెట్ ధరల తగ్గింపు అంశానికి సంబంధించి నిర్మాతలు ఇంకా ప్రభుత్వంతో చర్చించలేదు. onilne టికెట్ వ్యవహరానికి సంబంధించి మంత్రి నానితో నిర్మాతలు భేటీ అయ్యారు. ఆ తర్వాత సినిమా టికెట్ ధరల తగ్గింపు అంశంపై మాత్రం నిర్మాతలు ప్రభుత్వంతో ఇంకా భేటీ కాలేదు. 
 

click me!