కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ములేదు.. ఇక్కడ సొల్లు కబుర్లు, ఆయనో పెద్ద సుత్తి కేసు: పవన్‌పై పేర్నినాని సెటైర్లు

Siva Kodati |  
Published : Sep 26, 2021, 06:05 PM IST
కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ములేదు.. ఇక్కడ సొల్లు కబుర్లు, ఆయనో పెద్ద సుత్తి కేసు: పవన్‌పై పేర్నినాని సెటైర్లు

సారాంశం

ట్యాక్స్‌ల విషయంలో కేంద్ర పెద్దలను ప్రశ్నించే దమ్ము పవన్‌కు లేదని.. అందుకే ఇక్కడ సొల్లు కబుర్లు చెబుతూ వుంటాడని మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. సినిమా టికెట్ల డబ్బుతో ప్రభుత్వాన్ని ఏడాదంతా నడిపించేస్తారా అని ప్రశ్నించారు. 

ట్యాక్స్‌ల విషయంలో కేంద్ర పెద్దలను ప్రశ్నించే దమ్ము పవన్‌కు లేదని.. అందుకే ఇక్కడ సొల్లు కబుర్లు చెబుతూ వుంటాడని మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. సినిమా టికెట్ల డబ్బుతో ప్రభుత్వాన్ని ఏడాదంతా నడిపించేస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో అడ్డగోలుగా సినిమా టికెట్లను అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. పవన్ కల్యాణ్‌కు బుద్ధి, జ్ఞానం ఉండే మాట్లాడుతున్నాడా అన్న నాని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల గురించి వ్యంగ్యంగా మాట్లాడుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను కలలను సీఎం  వైఎస్ జగన్ సాకారం చేస్తున్నారని.. చంద్రబాబుకు ఏజెంట్‌గా వున్నావని ఎందుకు ఒప్పుకోవంటూ మంత్రి నిలదీశారు.

ALso Read:హీరో నాని మీద నీది కపటప్రేమ, ‘‘మా’’ ఎన్నికల కోసమే ఈ తిప్పలు: పవన్‌కు పేర్నినాని కౌంటర్

పవన్ కల్యాణ్ పెద్ద సుత్తి కేసని.. నేను సన్నాసిని అయితే పవన్ సన్నాసిన్నర అంటూ నాని చురకలు వేశారు. ఇద్దరిలో ఎవరు సన్నాసో ప్రజలకు తెలుసునన్నారు. ఆర్బీఐ గేట్‌ వే ద్వారా నిర్మాతలకు డబ్బులు అందుతాయని.. పవన్‌కు తిక్క లేదని అంతా డబ్బుల లెక్కేనని నాని ఆరోపించారు. ఎన్నికల్లో చంద్రబాబు చెప్పినట్లు పవన్ తన పార్టీ అభ్యర్ధులకు టికెట్లు ఇచ్చాడని మంత్రి ఆరోపించారు. లవ్‌స్టోరీ నిర్మాతలు ముందుకొచ్చి ఏపీ ప్రభుత్వం గురించి చెప్పాలని నాని విజ్ఞప్తి చేశారు. స్కూల్ ఫీజులను నియంత్రిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో ఇచ్చిందని... మాట్లాడేముందు పవన్ వాస్తవాలు తెలుసుకోవాలని ఆయన కోరారు. అవినీతి చేసే వారికి జగన్ ప్రభుత్వం సింహ స్వప్నమని.. న్యాయంగా వ్యాపారం చేసుకునేవారికి ఎలాంటి  ఇబ్బంది లేదని నాని చెప్పారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu
Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu