
ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పెడతానన్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కామెంట్లపై మంత్రి పేర్నినాని చురకలు అంటించారు. గురువారం కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని (perni nani) మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పార్టీ పెట్టాలని మేము కూడా కోరుకుంటున్నామన్నారు. రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎందుకు..? రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తే పోలేదా..? అంటూ నాని సెటైర్లు వేశారు.
ఏపీలో పార్టీ పెట్టడానికి ముందుగా.. తెలంగాణ కెబినెట్లో (telangana cabinet) రెండు రాష్ట్రాలను కలిపేయాలనే తీర్మానాన్నిపెడితే కేసీఆర్ పెడితే బాగుంటుందని మంత్రి పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు కలిసిపోతే ఆయన భేషుగ్గా పోటీ చేయొచ్చని.. ఏపీ, తెలంగాణలు ఒకటే రాష్ట్రంగా ఉండాలని జగన్ (ys jagan) గతంలోనే కోరుకున్నారని పేర్ని నాని గుర్తుచేశారు. ఇదే సమయంలో ఎయిడెడ్ విద్యాసంస్థలపై ఎలాంటి బలవంతం లేదని.. స్వచ్చందంగానే వారు తమ నిర్ణయం తీసుకోవచ్చని వెల్లడించారు. ఏపీలో గంజాయి గురించి కెబినెట్లోనే చర్చించామని 2017లోనే అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు (ganta srinivasa rao) చెప్పారని పేర్ని నాని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ (pawan kalyan) కూడా 2018లోనే గంజాయి సాగవుతోందని ట్వీట్ చేశారని సెటైర్లు వేశారు.
Also Read:ఏపీలో టీఆర్ఎస్ ఏర్పాటును ఎవరైనా వద్దన్నారా?: సజ్జల
ఇక ఇదే అంశంపై బుధవారం స్పందించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి. ఏపీలో Trs పార్టీని ఏర్పాటు పెడతానంటే ఎవరైనా వద్దన్నారా అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని పెట్టొద్దని ఎవరూ కూడా అడ్డు చెప్పలేదని సజ్జల గుర్తు చేశారు. రాజకీయ పార్టీని ఎవరైనా ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. దీనికి ఎవరి అనుమతులు కూడా అవసరం లేదన్నారు. పార్టీ ఏర్పాటే కాదు ఎక్కడైనా కూడ ఎవరైనా పోటీ చేయవచ్చని Sajjala Ramakrishna Reddy తెలిపారు.
కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో కూడా టీఆర్ఎస్ ను ఏర్పాటు చేయాలని Trs ప్లీనరీ సమావేశంలో Kcr వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దళితబంధును అమలు చేసిన తర్వాత ఈ వినతులు మరింత ఎక్కువయ్యాయని కేసీఆర్ చెప్పారు.ఈ వ్యాఖ్యలపైనే సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.ఈ సమావేశంలో తెలంగాణ ఏర్పాటైతే తెలంగాణ రాష్ట్రం మొత్తం అంధకారమౌతోందని సమైఖ్య పాలకులు భయపెట్టారన్నారు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత తమ రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు లేవన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కరెంట్ కష్టాలున్నాయన్నారు.