మేం చెప్పిన ధరకే విక్రయాలు జరగాలి: సినిమా టికెట్ల వివాదంపై పేర్ని నాని వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Sep 14, 2021, 02:32 PM IST
మేం చెప్పిన ధరకే విక్రయాలు జరగాలి: సినిమా టికెట్ల వివాదంపై పేర్ని నాని వ్యాఖ్యలు

సారాంశం

సినిమా టికెట్ల వివాదాన్ని త్వరలో పరిష్కరిస్తామన్నారు ఏపీ  రవాణా శాఖ మంత్రి పేర్ని నాని. సినిమా టికెట్లను పారదర్శకంగా ప్రజలకు అందిస్తామని.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయాలు జరగాలని పేర్ని నాని తెలిపారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమే టీడీపీ పని అంటూ నాని మండిపడ్డారు

సినిమా టికెట్ల వివాదాన్ని త్వరలో పరిష్కరిస్తామన్నారు ఏపీ  రవాణా శాఖ మంత్రి పేర్ని నాని. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన..  నిర్ణయించిన ధరకే టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం టికెట్ల వ్యాపారం చేస్తోందని ప్రతిపక్షం నోటికొచ్చినట్లు మాట్లాడుతోందని పేర్ని నాని మండిపడ్డారు. ప్రభుత్వం టికెట్ల వ్యాపారం చేయడం ఏంటని మంత్రి ప్రశ్నించారు. సినిమా టికెట్లను పారదర్శకంగా ప్రజలకు అందిస్తామని.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయాలు జరగాలని పేర్ని నాని తెలిపారు. నిబంధనలకు లోబడే షోలు ప్రదర్శించాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమే టీడీపీ పని అంటూ నాని మండిపడ్డారు. 2002లోనే ఆన్‌లైన్ టికెట్ల వ్యవస్థపై కేంద్రం రాష్ట్రాలకు లేఖ రాసిందని పేర్ని నాని గుర్తుచేశారు. 

PREV
click me!

Recommended Stories

YS Jagan Pressmeet: విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై జగన్ కీలక ప్రెస్ మీట్| Asianet News Telugu
YS Jagan Meets Vizag Steel Plant Tragedy Victims: స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా.. వైఎస్ జగన్