వాళ్లంతా భక్తులు.. దొంగ ఓట్లు వేసే ఖర్మ వైసీపీకి పట్టలేదు: చంద్రబాబుకు పెద్దిరెడ్డి చురకలు

By Siva KodatiFirst Published Apr 17, 2021, 4:50 PM IST
Highlights

టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబుపై మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తిరుపతికి వచ్చిన భక్తుల్ని దొంగ ఓట్లు వేయడానికి వచ్చారని అనడం దారుణమని వ్యాఖ్యానించారు. 

టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబుపై మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తిరుపతికి వచ్చిన భక్తుల్ని దొంగ ఓట్లు వేయడానికి వచ్చారని అనడం దారుణమని వ్యాఖ్యానించారు.

ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్‌ను అడ్డుకోవడానికి టీడీపీ కుట్ర చేస్తోందని మంత్రి ఆరోపించారు. అబద్ధాలు పుట్టించడంలో చంద్రబాబు దిట్టన్న ఆయన.. దొంగ ఓట్లు వేసే ఖర్మ మాకు పట్టలేదని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్యాన్ని టీడీపీ ఖూనీ చేస్తోందంటూ రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. తాము ఎవరితో కలిసి పోటీ చేయలేమని.. కానీ టీడీపీ ఎవరితోనైనా పొత్తు పెట్టుకుని పోటీ చేసే అలవాటని మంత్రి వ్యాఖ్యానించారు.

బాబు జూమ్, లోకేశ్ ట్విట్టర్‌లో మాత్రమే కనపడతారని.. ప్రజాస్వామ్యంలో టీడీపీ ప్రజామద్ధతు కోల్పోయిందని రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ఓటమికి ముందే దొంగ ఓట్ల పేరుతో టీడీపీ సాకులు  వెతుక్కుంటోందని పెద్దిరెద్ది ఆరోపించారు.

Also Read:జగన్ అనే వ్యక్తి కోసం కాదు: తిరుపతి ఎన్నికపై చంద్రబాబు అసహనం

దేశంలోనే 50 శాతానికి పైగా ఓట్లు వచ్చిన ఘనత వైఎస్ఆర్‌సీపీదేనని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు ఛీకొట్టినా చంద్రబాబులో మార్పు లేదని పెద్దిరెద్ది రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. నాకు తిరుపతిలో సొంతిల్లు వుందని.. చంద్రబాబుకే లేదని ఆయన స్పష్టం చేశారు. తిరుపతికి రోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారని మంత్రి తెలిపారు.

డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ.. పెద్దిరెడ్డిని టార్గెట్ చేసుకుని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తప్పుడు ప్రచారంతో టీడీపీ ఎలక్షన్ కమీషన్‌ను తప్పుదోవ పట్టిస్తోందని నారాయణస్వామి మండిపడ్డారు.

ఉపఎన్నికలో వైసీపీకి 6 లక్షలకు పైగా మెజార్టీ వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మతాలు, కులాలతో ప్రజల మధ్య చంద్రబాబు చిచ్చుపెడుతున్నారని నారాయణస్వామి ఆరోపించారు. 

click me!