ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సాయం కోరిన వైఎస్ జగన్... కారణమిదే

By Siva KodatiFirst Published Apr 17, 2021, 3:50 PM IST
Highlights

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం లేఖ రాశారు. వంశధార నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న నేరడి బ్యారేజ్ విషయంలో ఒడిశా ప్రభుత్వం సహకారాన్ని జగన్ కోరారు. నేరడి బ్యారేజీ నిర్మాణ విషయంలో ఒడిశాతో సంప్రదింపులకు తాము సిద్ధమని సీఎం లేఖలో స్పష్టం చేశారు.

దీనికి సంబంధించి చర్చించేందుకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ సహాయం కోరారు. నేరడి బ్యారేజ్ నిర్మాణంతో ఒడిశా రైతులకు సైతం లబ్ది చేకూరుతుందని జగన్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ వల్ల ఏపీలోని శ్రీకాకుళం జిల్లా రైతులకు, ఒడిశాలోని గజపతి జిల్లా రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి లేఖలో వెల్లడించారు.

సముద్రంలోకి వృథాగా పోయే 80 టీఎమ్‌సీల నీటిని నేరడి బ్యారేజ్ నిర్మాణం ద్వారా వినియోగంలోకి తీసుకురావచ్చని జగన్ చెప్పారు. దీనిపై నవీన్ పట్నాయక్ ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి. 

click me!