టీడీపీ గౌరవాధ్యక్షురాలిగా పనిచేస్తున్నట్లుంది .. వాస్తవాలు మాట్లాడాలి : పురందేశ్వరిపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్

Siva Kodati |  
Published : Nov 05, 2023, 05:23 PM IST
టీడీపీ గౌరవాధ్యక్షురాలిగా పనిచేస్తున్నట్లుంది .. వాస్తవాలు మాట్లాడాలి : పురందేశ్వరిపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్

సారాంశం

ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరిపై మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసినా తమకు ఇబ్బందేమి లేదని.. కానీ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని పెద్దిరెడ్డి చురకలంటించారు.

ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరిపై వైసీపీ నేతల విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందిస్తూ.. చంద్రబాబు తరపున పురందేశ్వరి వకాల్తా పుచ్చుకుంటే తమకేమీ అభ్యంతరం లేదన్నారు. ఆమె తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసినా తమకు ఇబ్బందేమి లేదని.. కానీ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని పెద్దిరెడ్డి చురకలంటించారు. మద్యం విషయంలో పురందేశ్వరి చంద్రబాబుతో మాట్లాడితే బాగుంటుందని.. రాష్ట్రంలోని డిస్టలరీలన్నీ ఆయన మంజూరు చేసినవేనని రామచంద్రారెడ్డి అన్నారు. ఈ విషయాన్ని ఆమె గ్రహించాలని.. ఇటీవలి పరిణామాలు చూస్తుంటే టీడీపీ గౌరవాధ్యక్షురాలిగా పురందేశ్వరి వ్యవహరిస్తున్నట్లుందని మంత్రి సెటైర్లు వేశారు. 

ఇకపోతే.. నిన్న పురందేశ్వరీపై మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఇంతకీ పురంధేశ్వరి కాంగ్రెస్ లో ఉందా? లేక టీడీపీలో ఉందా? అని నిలదీశారు. నేడు పురంధేశ్వరి ఒక లేఖ రాశారని టీడీపీ అనుకూల ప్రసార సాధనాల్లో హడావుడి చేస్తున్నారనీ , ఆమె లేఖలను భయపడేవారు, బెదిరిపోయే వాళ్లు  ఎవరూ  లేరని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గారి వదిన (పురేందేశ్వరీ)ని బీజేపీ రాష్ట్ర నాయకులే కొన్ని ప్రశ్నలు అడిగితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు రాజకీయ కక్ష సాధింపుగా జగన్ మీద, విజయసాయిరెడ్డి మీద పెట్టిన కేసుల్ని నేడు కాకపోతే రేపు ఏ న్యాయస్థానంలోనైనా రాజకీయ కేసులే తప్ప, ఎలాంటి అధికార దుర్వినియోగంగానీ, అవినీతిగానీ జరగలేదని నిర్థారించబడుతాయని అన్నారు.  కాబట్టి కేసులపై హడావుడి చేసినంతమాత్రాన, ఇక్కడ బెదిరేవాళ్ళు ఎవరూ లేరని  విమర్శించారు.  

ALso Read : Kodali Nani : "ఆమెకు రాజకీయ విలువలు ఉన్నాయా? లేవా?"

ఇంతకీ పురంధేశ్వరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉందా? లేక తెలుగుదేశం పార్టీలో ఉందా? అన్నది తేల్చుకోవాలని అన్నారు.  ఎందుకంటే.. ఆమె బీజేపీలో ఉన్నట్టు ఎక్కడా కనిపించడంలేదని మండిపడ్డారు. తెలంగాణలో టీడీపీ ఎన్నికల బరిలోకి దిగకపోవడంతో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ లో చేరానని మండిపడ్డారు. కాంగ్రెస్ వెనుక, కాంగ్రెస్ తోనూ ఉన్నది చంద్రబాబేనని అంత స్పష్టంగా కనిపిస్తుంటే.. తెలంగాణలో కాంగ్రెస్ తో పోరాడుతున్నాం, బీఆర్ఎస్ తో పోరాడుతున్నాం అంటున్న బీజేపీకి కాకుండా.. పురంధేశ్వరి టీడీపీకి మద్దతు ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో  పురంధేశ్వరి కాంగ్రెస్ లో ఉన్నట్టా..? లేక టీడీపీలో ఉన్నట్టా? లేక బీజేపీలో ఉన్నట్టా? అన్నది బీజేపీ వారే అర్థం చేసుకోవాలని సూచించారు. 

పురేందేశ్వరీ గతాన్ని చూస్తే.. టీడీపీలో ఉండి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిందనీ, కాంగ్రెస్ లో ఉండి కేంద్ర మంత్రి పదవి అనుభవించి, అధికారం పోయిందని వారినీ వదిలేసి బయటకు వచ్చిందని విమర్శించారు. ఆ తర్వాత బీజేపీలో చేరినా, బాబు ఆదేశాల మేరకు.. బాబు ప్రయోజనాల కోసమే చేరిందని అన్నారు. దీన్ని బట్టి పురంధేశ్వరికి రాజకీయ విలువలు ఉన్నాయా? లేవా? అనేది తేల్చుకోవాలని అన్నారు.  కాంగ్రెస్ లో ఉన్నా రేణుకా చౌదరి, బీజేపీలో ఉన్నా పురంధేశ్వరి.. చంద్రబాబు ప్రయోజనాలు, చంద్రబాబు బృందం ప్రయోజనాలు కాపాడటంలో ముందుకు దూకుతున్నారనీ, వీరి రాజకీయం చంద్రబాబు కోసం కాదా అని ప్రశ్నించారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Minister Nara Lokesh Conducts Surprise Inspection at Mylavaram School | Asianet News Telugu
Koil Alwar Thirumanjanam at Tirumala Temple: తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం | Asianet News Telugu