షర్మిల మాకు రాజకీయ శత్రువే .. చంద్రబాబు కుట్రతోనే జగన్‌పై విమర్శలు : పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Feb 3, 2024, 9:29 PM IST

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైఎస్ కుటుంబం విడిపోవడానికి , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేయడానికి, జగన్‌ను జైల్లో పెట్టడానికి, రాష్ట్ర విభజనకు మూల కారణం చంద్రబాబేనంటూ పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 


ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఉచ్చులో వున్నంత వరకు షర్మిలను ప్రతిపక్షంగానే భావిస్తామన్నారు. వైఎస్ కుటుంబం విడిపోవడానికి , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేయడానికి, జగన్‌ను జైల్లో పెట్టడానికి, రాష్ట్ర విభజనకు మూల కారణం చంద్రబాబేనంటూ పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని, కాంగ్రెస్ శవాన్ని షర్మిల, కేవీపీ , రఘువీరా రెడ్డి, గిడుగు రుద్రరాజు మోస్తున్నారని ఎద్దేవా చఏశారు. కాంగ్రెస్‌లో వున్నవారంతా వైసీపీలోకి చేరిపోయారని రామచంద్రారెడ్డి గుర్తుచేశారు. చంద్రబాబు రాజకీయ కుట్రలో భాగంగానే సీఎం జగన్‌పై షర్మిల విమర్శలు చేస్తున్నారని పెద్దిరెద్ది విమర్శించారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర వుందని ఆయన ఆరోపించారు. 

Latest Videos

చంద్రబాబు పచ్చి మోసగాడని.. రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేశారని పెద్దిరెడ్డి దుయ్యబట్టారు. డ్వాక్రా సంఘాలను చంద్రబాబు నిర్వీర్యం చేశారని.. ఆసరా, చేయూతల ద్వారా మహిళలను ఆదుకున్న ఘనత జగన్‌దేనని పెద్దిరెడ్డి ప్రశంసించారు. ఓటు హక్కు లేని వారికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని.. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. 
 

click me!