సొంత జిల్లాలో... మానవత్వాన్ని చాటుకున్న మంత్రి పెద్దిరెడ్డి

By Arun Kumar PFirst Published Mar 11, 2021, 1:58 PM IST
Highlights

తన బిజీ షెడ్యూల్ ను కూడా పక్కనబెట్టి మరీ రోడ్డుపై ప్రాణాపాయ స్థితిలో వున్న కాపాడటానికి సమయాన్ని కేటాయించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.  

చిత్తూరు: తన పేరే కాదు మనసు కూడా పెద్దదని నిరూపించుకున్నారు ఆంధ్ర ప్రదేశ్ పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తన బిజీ షెడ్యూల్ ను కూడా పక్కనబెట్టి మరీ రోడ్డుపై ప్రాణాపాయ స్థితిలో వున్న కాపాడటానికి సమయాన్ని కేటాయించారు మంత్రి. క్షతగాత్రున్ని దగ్గరుండి హాస్పిటల్ కు తరలించి అండగా నిలిచారు పెద్దిరెడ్డి. 

అధికారిక కార్యక్రమాల్లో భాగంగా మంత్రి పెద్దిరెడ్డి ఇవాళ(గురువారం) చిత్తూరు జిల్లా సోమల మండలం నిజాంపేట మీదుగా వెళుతుండగా ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో రోడ్డుమీద పడివుండటాన్ని గమనించారు. అతడికి సాయం చేయడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో స్వయంగా మంత్రే అండగా నిలిచారు. వెంటనే తన వాహనశ్రేణిని నిలిపి గాయపడిని వ్యక్తికి మంచినీరు తాగించారు. ఆ తర్వాత హాస్పిటల్ కు తరలించే ఏర్పాటు చేశారు. పోలీసులు, స్థానికుల సాయంతో క్షతగాత్రున్ని తన కాన్వాయ్ లోని పోలీస్ వాహనంలో ఎక్కించి హాస్పిటల్ కు పంపించారు. 

ఇలా మంత్రి కాపాడిన సుబ్బయ్య ప్రస్తుతం సోమల ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం అతన్ని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ప్రాణాపాయ స్థితిలో వ్యక్తిని కాపాడి మంచిమనసు చాటుకున్నారు మంత్రి పెద్దిరెడ్డి. 
 

click me!