కలిసి పోరాడదాం: పవన్‌కు మంత్రి నారాయణ సూచన

By Arun Kumar PFirst Published Jan 5, 2019, 11:50 AM IST
Highlights

రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న తెలుగు దేశంతో జనసేన పార్టీ కలిసి రావాలంటూ మంత్రి నారాయణ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని జనసేన పార్టీ ఏర్పాటుచేసిన ఫ్యాక్ట్స్ ఫైడింగ్ కమిటీనే నిర్ధారించిందని ఆయన గుర్తు చేశారు. కాబట్టి   కేంద్రంపై ఒంటరిగా పోరాటం చేస్తున్న చంద్రబాబు కు పవన్ కళ్యాణ్ అండగా నిలవాలని నారాయణ సూచించారు. 

ఈ ఇద్దరు నాయకులు కలిసి కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి పోరాడాలన్నారు. కేంద్రం నుండి రాష్ట్రానికి రూ.75వేల కోట్లు రావాల్సి వుందని  ప్యాక్ట్స్‌ ఫైండింగ్‌ కమిటీ నిర్ధారించిన తర్వాత కూడా పవన్ మౌనంగా వుండటం  మంచిదికాదన్నారు. రాష్ట్రంలోని పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వంపై ప్రశ్నించాలని నారాయణ సూచించారు. 

 వైఎస్సార్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డికి  రాష్ట్రం ఏమైపోయినా పట్టదంటూ ఎద్దేవా  చేశారు. తనపై వున్న కేసులను మాఫీ చేయించుకోడానికి జగన్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని....అందుకోసమే మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం గానీ, ప్రశ్నించడం కానీ చేయడంలేదంటూ నారాయణ పేర్కొన్నారు. 
 
click me!