వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేస్తుండగా లోకేష్ రియాక్షన్ చూడండి..!!

By Arun Kumar P  |  First Published Jun 21, 2024, 4:32 PM IST

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యం ఆవిషృతమైంది. గత ఐదేళ్లు వైసిపి నాయకులతో నిండిన ఇవాళ పసుపుమయం అయ్యింది.  ఇలా టిడిపి సభ్యులతో నిండిపోయిన అసెంబ్లీలో వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేస్తున్నసమయంలో పరిస్థితి ఎలా వుందంటే... 


అమరావతి : ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయనే సామెతకు ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఉదాహరణగా నిలిచింది. గతంలో వైసిపి నాయకులతో నిండివున్న సభ ఇప్పుడు పసుపుమయంగా మారింది.  ఏ అసెంబ్లీలో అయితే అవమానానికి గురయ్యారో అదే సభలోకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు మాస్ ఎంట్రీ ఇచ్చారు. ఇక గత ఐదేళ్లు రాచమర్యాదలు పొందిన సభలోకి వైఎస్ జగన్ ఓ అనామకుడిలా ఎంట్రీ ఇచ్చారు. అసలు అసెంబ్లీకే రాడనుకున్న జగన్ ప్రమాణస్వీకారం చేయడానికి వచ్చారు. 

శపథం చేసిమరీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఎమ్మెల్యేలంతా చంద్రబాబు రాగానే నినాదాలతో హోరెత్తించారు... దీంతో సభ దద్దరిల్లింది. ఇక సభలోకి వైఎస్ జగన్ ఎంట్రీ  సమయంలో నిశ్శబ్దం ఆవరించింది. పసుపుమయమైన సభలోకి ఆయన కాస్త ఇబ్బందిగానే అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేటపుడు ఆయన ఇబ్బంది స్పష్టంగా బయటపడింది. 

Latest Videos

ఒకప్పుడు అనర్గళంగా మాట్లాడిన అదే సభలో తన పేరును కూడా సరిగ్గా పలకలేకపోయాడు వైఎస్ జగన్. వైఎస్ జగన్ మోహన్ అనే నేను అంటూ ప్రమాణస్వీకారాన్ని ప్రారంభించారు... అయితే తప్పును గ్రహించిన ఆయన వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ సరిచేసుకున్నారు. ఇలా వైఎస్ జగన్ ప్రమాణస్వీకార సమయంలో తడబడిన వీడియో  సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది... కూటమి దెబ్బకు తన పేరును కూడా జగన్ మరిచారంటూ టిడిపి అనుకూల వర్గాలు జగన్ ను ట్రోల్ చేస్తున్నారు. 
 
ఇదిలావుంటే ఎప్పుడూ అసెంబ్లీ మెయిన్ గేట్ నుండి వచ్చే వైఎస్ జగన్ ఈసారి వెనక గేటు నుండి లోపలికి వచ్చారు. నేరుగా సభలోకి రాకుండా వెయిట్ చేసారు... సరిగ్గా  ప్రమాణస్వీకార సమయానికి సభలో అడుగుపెట్టారు. అయితే అప్పటివరకు కూటమి సభ్యులతో సందడిగా వున్న అసెంబ్లీ నిశ్శబ్దంగా మారింది...  వైఎస్ జగన్ ప్రమాణస్వీకారాన్ని ఆసక్తిగా గమనించారు.

జగన్ ప్రమాణస్వీకార సమయంలో ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మంత్రి నారా లోకేష్ లు గుర్రుగా కనిపించారు. ప్రమాణస్వీకారానికి ముందు, తర్వాత జగన్ నమస్కారం చేసినా లోకేష్ పట్టించుకోలేడు. ఇక ప్రమాణస్వీకారం అనంతరం జగన్ ప్రోటెం స్పీకర్ వద్దకువెళ్లి కరచాలనం చేసినా ఆయన ఒక్కమాట మాట్లాడలేదు... కనీసం చిరునవ్వయినా చిందించలేదు. ఇలా వైఎస్ జగన్ ప్రమాణస్వీకార సమయంలో సభలో నెలకొన్న పరిస్థితులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా అవుతోంది. 

శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వైయస్ఆర్ సీపీ అధినేత గారు. pic.twitter.com/SQ3bxeS0V6

— YSR Congress Party (@YSRCParty)


 

click me!