సీఎం అవుదామని బాలయ్య డ్రీమ్.. బాబు ఉండగా జరిగేపనేనా: మోపిదేవి వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published May 28, 2020, 3:28 PM IST
Highlights

ఎప్పుడు సీఎం అవుదామా అని బాలకృష్ణ కలలు కంటున్నారని.. తన భావను ధిక్కరించి ముఖ్యమంత్రి అయ్యే పరిస్ధితి ఉందా అని మోపిదేవి సందేహం వ్యక్తం చేశారు. రెండేళ్ల తర్వాత అధికారంలోకి వస్తామని బాలకృష్ణ భ్రమల్లో బ్రతుకుతున్నారని మంత్రి మోపిదేవి వెంకట రమణ సెటైర్లు వేశారు. 

ఎప్పుడు సీఎం అవుదామా అని బాలకృష్ణ కలలు కంటున్నారని.. తన భావను ధిక్కరించి ముఖ్యమంత్రి అయ్యే పరిస్ధితి ఉందా అని మోపిదేవి సందేహం వ్యక్తం చేశారు. రెండేళ్ల తర్వాత అధికారంలోకి వస్తామని బాలకృష్ణ భ్రమల్లో బ్రతుకుతున్నారని మంత్రి మోపిదేవి వెంకట రమణ సెటైర్లు వేశారు.

ఏడాది కాలంలో సీఎం జగన్ ఆంధ్ర ప్రజల ఆశాజ్యోతిగా మారారని అన్నారు మంత్రి మోపిదేవి వెంకటరమణ. గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా సీఎం జగన్ పాలన చేస్తున్నారని ప్రశంసించారు.

ముఖ్యమంత్రికి ప్రజలు కష్టాలు క్షుణ్ణంగా తెలుసునని.. ప్రజల ఆకాంక్షకు మిన్నగా జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారని కొనియాడారు. సంక్షేమ కార్యక్రమాలు కోసం 40 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారని.. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని మోపిదేవి అన్నారు.

దేశంలో ఎక్కడ లేని విధంగా ఏపీలో గ్రామ సచివాలయ వ్యవస్థ ను తీసుకువచ్చి, దేశానికే ఆదర్శ ముఖ్యమంత్రిగా మారారని వెంకటరమణ ప్రశంసించారు.  సీఎం జగన్ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారని.. అలాంటి వ్యక్తిపై విమర్శలు చేసేందుకే మహానాడు ఏర్పాటు చేశారని మంత్రి ఆరోపించారు.

జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక మహానాడులో విమర్శలు చేస్తున్నారని మోపిదేవి ఎద్దేవా చేశారు. అది మహానాడులా లేదని.. చంద్రబాబు భజన బృందంలా ఉందని ఆయన ధ్వజమెత్తారు. పార్టీ గురించి చర్చించ కుండా ప్రభుత్వంపై బురద జల్లేందుకు మహానాడు పెట్టారని మోపిదేవి ఆరోపించారు.

మీ తీర్మానాలను చూస్తే ఎన్టీఆర్ ఆత్మ గోషిస్తుందని వ్యాఖ్యానించారు. ఈనాడు పత్రికలో చెత్త వార్తలు రాస్తున్నారని.. చేతనైతే ప్రజలకు పనికి వచ్చే వార్తలు రాయాలన్నారు. రాష్ట్రం దివాళా తీసింది చంద్రబాబు హయాంలోనే అన్న ఆయన.. టీడీపీ హయాంలో రెండున్నర లక్షల కోట్లు అప్పులు పాలు చేశారని మోపిదేవి ఆరోపించారు.

జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజా క్షేత్రంలో టీడీపీతో చర్చకు సిద్దమని.. తమతో చర్చించేందుకు తెలుగుదేశం సిద్ధమా అని సవాల్ విసిరారు. 50 వేల కోట్లు పన్నులు వేశారు అని టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారన్న మోపిదేవి.. అందుకు ఆధారాలుంటే చూపించాలని డిమాండ్ చేశారు.

అప్పుల సాంస్కృతి టీడీపీదేనని.. ఆ అప్పులను తెలుగుదేశం నేతలు తమ జేబుల్లో వేసుకున్నారని ధ్వజమెత్తారు. చేసిన అప్పుతో ఏమి చేశారో చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 80 వేల కోట్లు ఎక్కడ అప్పు చేశారో చూపించాలని.. మహానాడు వేదికగా చంద్రబాబు అసత్యప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.

చేతిలో ఎల్లో మీడియా ఉందని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మోపిదేవి ధ్వజమెత్తారు. కరోనాపై  సీఎం చర్యలను దేశం మొత్తం మెచ్చుకుందని.. ప్రచార ఆర్భాటానికి దూరంగా జగన్ కరోనాపై చర్యలు చేపడుతున్నారని ఆయన మండిపడ్డారు.

టీటీడీ ఆస్తులను అమ్మలని నిర్ణయం తీసుకుంది టీడీపీ హయాంలోనేనని, అప్పుడు జరిగిన జరిగిన అన్ని వాస్తవాలను సుబ్రహ్మణ్య స్వామి బయటపెట్టారని మంత్రి మోపిదేవి గుర్తుచేశారు. టీడీపీ హయాంలో రేషన్ కార్డుకు 3 వేలు, పింఛన్‌కు 5 వేలు, ఇంటికి 25 వేలు వసూలు చేసేవారని మంత్రి విమర్శించారు. 

click me!