ప్రభుత్వ భూముల విక్రయాలపై ఏపీ హైకోర్టు మెలిక, విచారణ జూన్ 18కి వాయిదా

By narsimha lodeFirst Published May 28, 2020, 2:34 PM IST
Highlights

తమకు తెలియకుండానే ప్రభుత్వ భూముల విక్రయ టెండర్లు ఖరారు చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది ఏపీ హైకోర్టు. ప్రభుత్వ భూముల విక్రయాలపై ఏపీ హైకోర్టు గురువారం నాడు విచారణను చేపట్టింది.
 


అమరావతి: తమకు తెలియకుండానే ప్రభుత్వ భూముల విక్రయ టెండర్లు ఖరారు చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది ఏపీ హైకోర్టు. ప్రభుత్వ భూముల విక్రయాలపై ఏపీ హైకోర్టు గురువారం నాడు విచారణను చేపట్టింది.

ప్రభుత్వ భూముల అమ్మకాలను సవాల్ చేస్తూ గుంటూరుకు చెందిన సురేష్ బాబు, మరో మూడు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ప్రభుత్వ భూముల విక్రయాలకు సంబంధించిన వేలం ప్రక్రియను జూన్ 11,12,13 తేదీలకు వాయిదా వేసినట్టుగా ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.ఈ కేసును వేసవి సెలవులను అనంతరం జూన్ 18కి వాయిదా వేసింది హైకోర్టు.

also read:జడ్జిలపై సోషల్ మీడియాలో పోస్టులు: ఎంపీ సురేష్ సహా 49 మందికి హైకోర్టు నోటీసులు

ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాలోని ప్రభుత్వ భూములను విక్రయించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. తొలి విడతగా విశాఖ, గుంటూరు జిల్లాల్లోని తొమ్మిది చోట్ల ప్రధాన ప్రాంతాల్లోని విలువైన ప్రభుత్వ భూములను ఈ వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

also read:ప్రభుత్వం దివాళా తీసిందా?: ఏపీ హైకోర్టు సూటి ప్రశ్న

ఈ భూముల విక్రయం ద్వారా రూ. 300 కోట్ల మేరకు ఆదాయం లభిస్తోందని అధికారులు అంచనా వేశారు.ఈ నెల 29వ తేదీన ఈ వేలం ద్వారా భూముల విక్రయాలు జరపాలని నిర్ణయం తీసుకొన్నారు.అయితే ఇదే సమయంలో ప్రభుత్వ  భూముల విక్రయాలపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ సాగించింది హైకోర్టు.

click me!