మట్టి, ఇసుక లూటీ .. ఆయన బతుకు అందరికీ తెలుసు : నక్కా ఆనందబాబుపై మంత్రి నాగార్జున ఆరోపణలు

Siva Kodati |  
Published : May 31, 2022, 04:00 PM IST
మట్టి, ఇసుక లూటీ .. ఆయన బతుకు అందరికీ తెలుసు : నక్కా ఆనందబాబుపై మంత్రి నాగార్జున ఆరోపణలు

సారాంశం

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అప్పట్లో మట్టి, ఇసుకలను దోపిడీ చేశారని మంత్రి మేరుగు నాగార్జున ఆరోపించారు. ప్రస్తుతం తాము నియమిస్తున్న జగనన్న కాలనీలకు మట్టి తవ్వకాలకు అన్ని అనుమతులు వున్నాయని చెప్పారు.   

టీడీపీ (tdp) నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబుపై (nakka anand babu) ఏపీ మంత్రి మేరుగు నాగార్జున (merugu nagarjuna) ఫైరయ్యారు. నక్కా ఆనందబాబు బతుకేంటో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మట్టి, ఇసుకతో భారీ దోపిడీకి పాల్పడ్డారని మంత్రి ఆరోపించారు. వేమూరు (vemuru) నియోజకవర్గంలో వైయస్సార్ జగనన్న కాలనీల్లో (ysr jagananna colonies) నిర్మిస్తున్న ఇళ్లకు అన్ని అనుమతులతో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని నాగార్జున చెప్పారు. మట్టి తవ్వకాలకు సంబంధించి కలెక్టర్ అనుమతులు, పంచాయతీ తీర్మానాలు ఉన్నాయని స్పష్టం చేశారు. అక్రమ మట్టి తవ్వకాలు అంటూ నక్కా ఆనందబాబు హడావుడి చేయడానికి యత్నించారని.. దీంతో, ఆయనకు ప్రజలు గుణపాఠం చెప్పారని మంత్రి నాగార్జున దుయ్యబట్టారు. ఏ ఊరుకి వెళ్లినా ఆయనకు ఇదే గతి పడుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఇకపోతే.. వైసిపి ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jaganmohan reddy) మూడేళ్ల పాలనపై టీడిపి మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ (dhulipalla narendra) సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ మూడేళ్లలోనే ఏపీ ప్రజలకు నరకాన్ని చూపించారని... మిగిలిన రెండేళ్లూ ఈ నరకాన్నే అనుభవించక తప్పదన్నారు. జగన్ ది జనరంజక పాలన కాదు జనపీడిత పాలన అని... ఏపీలో సంక్షేమ పాలన కాదు సంక్షోభ పాలన నడుస్తోందంటూ ధూళిపాళ్ల ఎద్దేవా చేసారు. 

Also Read:జగన్ పాలన జనరంజకం కాదు జనపీడితం... సంక్షేమ కాదు సంక్షోభం..: దూళిపాళ్ల ఎద్దేవా

ముఖ్యమంత్రి జగన్ కు పాలనపై కంటే రాజకీయాలు, ఇతర వ్యవహారాలపైనే ఆసక్తి చూపిస్తారని అన్నారు. రాష్ట్ర పాలనలో అతి ముఖ్యమైన సచివాలయానికి కనీసం నెలకోసారైనా రారని... ఈయన పాలనలో ప్రజా సంక్షేమం, అభివృద్దిని ఆశించలేమని ధూళిపాళ్ళ అన్నారు. ఎన్నికలకు ముందు వైసిపి ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలువంచి ప్రత్యేక హోదా (special status to ap) తెస్తానన్న జగన్ మాటలు ప్రజలు నమ్మారని... అందువల్లే 22 మంది ఎంపీలను గెలిపించారన్నారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి రాయితీలు వస్తాయని... తద్వారా భారీగా పరిశ్రమలు వస్తాయని గతంలో ఇదే జగన్ చెప్పారని గుర్తుచేసారు. కానీ ఇప్పుడేమో ప్రత్యేక హోదాపై సీఎం జగన్ ప్లేట్ ఫిరాయించాడని ధూళిపాళ్ల ఆరోపించారు. 

గతంలో టిడిపి (tdp) ప్రభుత్వ హయాంతో పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించి రైతులు ఆనందంగా వుండేవారని ధూళిపాళ్ల అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వుండగా  రూ.16వందలకు అమ్ముకున్న ధాన్యం జగన్ హయాంలో నేడు వెయ్యికి దిగజారిందని అన్నారు.  వ్యవసాయరంగం సంక్షోభంలోకి నెట్టబడిందని ప్రభుత్వ గణాంకాలే తేల్చాయని ధూళిపాళ్ల ఆందోళన వ్యక్తం చేసారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం