లోకేష్ భలే స్పీడుగున్నారు

First Published Nov 15, 2017, 7:37 AM IST
Highlights
  • పలువురు మంత్రుల పనితీరుపై చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు.

పలువురు మంత్రుల పనితీరుపై చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. ఫైళ్ళ క్లియరెన్స్ కు సంబంధించి మంత్రులు, తన పేషీలోని ఉన్నతాధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో వారి పనితీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఒక్కో ఫైల్ క్లియర్ కావటానికి సగటున 43 రోజులు పడుతోంది. అంటే దాదాపు నెలన్నర టైమ్ తీసుకుంటున్నారు. మంత్రుల్లో అందరికన్నా ఎక్కువ సమయం తీసుకుంటున్నది ఘనత వహించిన మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు. ఈయన గారి పేషీలో ఒక్కో ఫైల్ సగటున 66 రోజులుంటోంది. అంటే 2 నెలలు దాటిపోతోంది.

ఇదే విషయమై సిఎం మాట్లాడుతూ, ‘ఈయన సమావేశాలకు హాజరుకారు, ఇక్కడా కనిపించరు..ఆయనదో ప్రత్కేక ధోరణి’ అంటూ విసుక్కున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఫైల్ క్లియర్ చేయటానికి సగటున 5 రోజులు తీసుకుంటున్నారట. అంతకుముందు 77 రోజులు తీసుకునేవారట. హోం శాఖ మంత్రి చిన్నరాజప్ప కేవలం 4 గంటల్లోనే పరిష్కరిస్తున్నారట. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ‘అసలు హోం మంత్రి వచ్చిన ఫైల్ ను వచ్చినట్లు పంపేస్తున్నట్లున్నారు’ అంటూ చమత్కరించారు. తర్వాత పంచాయితీరాజ్ శాఖ మంత్రి లోకేష్ 6 గంటలు తీసుకుంటున్నారట.

ఇక, పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ అయితే ఒక్కో ఫైల్ కు 35 రోజులు తీసుకుంటున్నారట. అదే విషయాన్ని మాట్లాడుతూ ‘ ఇలా అయితే ఎలాగమ్మా? అంటూ ప్రశ్నించారు. ‘దాపరికం ఏమీ లేదు..మా పేషీ సహా ఎవరి దగ్గర ఎన్ని రోజులు ఫైళ్ళు పెండింగ్ లో ఉన్నాయో ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది’ అంటూ హెచ్చరించారు. ఇక, అధికారుల్లో శ్ర నరేష్, జాస్తి కృష్ణ కిషోర్ గురించి మాత్రమే చెప్పారు.  నరేష్ వద్ద 21 రోజులు, కిషోర్ వద్ద 25 రోజులు ఫైళ్ళు పెండింగ్ లో ఉంటున్నాయట. ‘ఈయన వద్దకు ఏం ఫైళ్ళు వెళుతున్నాయో ఏమిటో’ అంటూ నిట్టూర్చారు. ఇన్నేసి రోజులు ఫైల్ క్లియరెన్స్ కోసం తీసుకోవటం బాగాలేదని మంత్రులు ఇంకా స్పీడ్ పెంచాలని సూచించారు. ఫైల్ క్లియర్ కాకపోవటం వల్లే జనాలు సచివాలయం చుట్టూ తిరుగుతున్నట్లు చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసారు.

click me!