పవన్ జాలేస్తోంది.. చంద్రబాబు విష కౌగిలి నుంచి బయటపడు : మంత్రి కొట్టు సత్యనారాయణ

Siva Kodati |  
Published : Aug 01, 2023, 07:53 PM IST
పవన్ జాలేస్తోంది.. చంద్రబాబు విష కౌగిలి నుంచి బయటపడు : మంత్రి కొట్టు సత్యనారాయణ

సారాంశం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌లపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి కొట్టు సత్యనారాయణ. చంద్రబాబు విషకౌగిలిలో పవన్ కల్యాణ్ చిక్కుకుపోయాడని.. పవన్‌ని చూస్తే జాలేస్తోందని అన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌లపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి కొట్టు సత్యనారాయణ. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను ఏం చేసినా భాజాభజంత్రీలు కొట్టే మీడియా వుందని చంద్రబాబు విర్రవీగుతున్నారని ఫైర్ అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్‌ను చంద్రబాబు ఏటీఎం కార్డులా మార్చారని ప్రధాని మోడీయే అన్నారని కొట్టు సత్యనారాయణ ఎద్దేవా చేశారు. చంద్రబాబు గురించి 100 పుస్తకాలు రాయొచ్చని.. ఆయన కొడుకు మాలోకమని మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. 

చిరంజీవి కుటుంబంపై చంద్రబాబు చేసిన కుట్రలు అందరికీ తెలుసునని.. కాపులను అణచివేయడానికి ఆయన చేయని ప్రయత్నం లేదని కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. రంగా హత్య నుంచి ముద్రగడ వరకు చంద్రబాబు ప్రమేయం వుందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు విషకౌగిలిలో పవన్ కల్యాణ్ చిక్కుకుపోయాడని.. పవన్‌ని చూస్తే జాలేస్తోందని కొట్టు సత్యనారాయణ అన్నారు. వైఎస్ జగన్‌ని గద్దె దించడమే పవన్ ధ్యేయమన్నారు.

ALso Read: జగన్ టార్గెట్: ఇక ఎపిలోనే పవన్ కల్యాణ్ మకాం, అంతా రెడీ

ఇకపోతే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ సమయం ఉండటంతో తన దృష్టి మొత్తం అటువైపుగా మళ్లిస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ తన మకాంను మంగళగిరికి షిఫ్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక్కడి నుంచే పార్టీకి సంబంధించి కార్యకలాపాలు కొనసాగించాలని ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.  ఎపి సిఎం వైఎస్ జగన్ పార్టీని ఓడించే లక్ష్యంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల నిమిత్తం ఏపీకి వెళ్లి వస్తున్నారు. మరోవైపు సినిమా షూటింగ్‌లతో కూడా బిజీగా గడుపుతున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. పార్టీ కార్యక్రమాలపై ఎక్కువగా సమయం కేటాయించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో ఉన్న జనసేన కేంద్ర కార్యాలయాన్ని ఇప్పటికే మంగళగిరికి మార్చేశారు. హైదరాబాద్‌లోని జనసేన  పార్టీ కార్యాలయంలో కొంత సామాగ్రిని కూడా అవరసం మేరకు మంగళగిరికి తరలించారు. పవన్ కూడా ప్రస్తుతం మంగళగిరిలోని బస చేయనున్నారని తెలుస్తోంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?