చంద్రబాబు ‘నిప్పు’ అని మరోసారి రుజువైంది..కొల్లు రవీంద్ర

Published : Sep 26, 2018, 02:14 PM IST
చంద్రబాబు ‘నిప్పు’ అని మరోసారి రుజువైంది..కొల్లు రవీంద్ర

సారాంశం

లోకేష్‌ ఎన్నిసార్లు సవాళ్లు విసిరినా జగన్‌ స్వీకరించలేదని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా యువనేస్తం పథకాన్ని ప్రారంభించామని, యువనేస్తానికి 4లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారని కొల్లు రవీంద్ర చెప్పారు.

ఏపీ సీఎం చంద్రబాబుపై మంత్రి కొల్లు రవీంద్ర ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు ఎలాంటి అవినీతికి పాల్పడరని.. ఆయన నిప్పు అని పేర్కొన్నారు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ ప్రతిపక్ష పార్టీల నేతలు అభాసుపాలవుతున్నారని మంత్రి   హేళన చేశారు.

హైకోర్టులో పిటిషన్ కొట్టివేతతో చంద్రబాబు నిప్పు అని మరోసారి రుజువైందని అన్నారు. చంద్రబాబుపై వేసిన ఒక్క కేసునూ రుజువు చేయలేకపోయారన్నారు. వైసీపీ చర్యలతో రాష్ట్రం పరువుపోతోందని మండిపడ్డారు. లోకేష్‌ ఎన్నిసార్లు సవాళ్లు విసిరినా జగన్‌ స్వీకరించలేదని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా యువనేస్తం పథకాన్ని ప్రారంభించామని, యువనేస్తానికి 4లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారని కొల్లు రవీంద్ర చెప్పారు.
 
చంద్రబాబు, లోకేష్‌పై హైకోర్టులో అవినీతి ఆరోపణల కేసును పిటిషనర్ శ్రవణ్‌కుమార్ ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే