ఎన్టీఆర్ ప్రజలే దేవుళ్లంటే.. ఈయన సిగ్గు, శరం లేదా అంటున్నారు: బాబుపై కొడాలి నాని ఫైర్

By Siva KodatiFirst Published Mar 30, 2021, 4:40 PM IST
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మరోసారి విరుచుకుపడ్డారు మంత్రి కొడాలి నాని. మంగళవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు ప్రజలను దేవుళ్లుగా కాదు కనీసం వారిని మనుషులుగా కూడా చూడటం లేదంటూ ఫైరయ్యారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మరోసారి విరుచుకుపడ్డారు మంత్రి కొడాలి నాని. మంగళవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు ప్రజలను దేవుళ్లుగా కాదు కనీసం వారిని మనుషులుగా కూడా చూడటం లేదంటూ ఫైరయ్యారు.

మొన్నటి ఎన్నికల్లో ప్రజలను చంద్రబాబు తిట్టారంటూ నాని గుర్తుచేశారు. లోకేశ్‌ను ఓడించారని చంద్రబాబు ప్రజలను బూతులు తిట్టారంటూ కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి ఓటేసిన ప్రజలను చులకన చేసి మాట్లాడుతున్నారని.. రాష్ట్రానికి అప్పు తెచ్చిపెట్టింది చంద్రబాబు కాదా అంటూ నాని ప్రశ్నించారు.

చంద్రబాబు తన పాలనలో సింగపూర్‌కి అప్పిచ్చారా అంటూ ఎద్దేవా చేశారు. మీరు పక్క రాష్ట్రాలకు అప్పు ఇచ్చేవారా .. చంద్రబాబుు అప్పులు తెచ్చి దుబారా చేశారని నాని మండిపడ్డారు.

ప్రజలను ఆదుకునేందుకు అప్పు తీసుకొచ్చామని.. అందుకే మొన్నటి ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించారని మంత్రి అన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సీఎం అయ్యారని.. ఎప్పుడైనా మీరు ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారా అంటూ నాని ప్రశ్నించారు.

టీడీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని.. చంద్రబాబు హయాంలో 3 లక్షల 60 వేల కోట్ల అప్పులు చేశారని మంత్రి ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి పేదలను ఆదుకునేందుకు అప్పులు తెస్తున్నారని నాని చెప్పారు.

ఎన్టీఆర్ సిద్ధాంతాలను, ఆశయాలను చంద్రబాబు తుంగలో తొక్కారని.. నిన్న జరిగింది టీడీపీ ఆవిర్భావ దినోత్సవం కాదని.. పగటి వేషగాళ్ల డ్రామా అంటూ ఎద్దేవా చేశారు. ప్రజలే దేవుళ్లని ఎన్టీఆర్ అంటే.. చంద్రబాబు బూతులు తిడుతున్నారని నాని మండిపడ్డారు.

వ్యవస్థలను మేనేజ్ చేసుకోవటమే చంద్రబాబు బతుకని.. ఎల్లో మీడియా రాతల్ని జనం నమ్మరని మంత్రి స్పష్టం చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో 5 లక్షల మెజార్టీతో గెలుస్తామని కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు.  

click me!