చంద్రబాబు కోసమే జగన్‌పై పిచ్చి రాతలు: ఏబీఎన్ రాధాకృష్ణపై కొడాలి నాని ఆగ్రహం

By Siva KodatiFirst Published Jun 27, 2021, 7:24 PM IST
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణలపై విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి కొడాలి నాని. తాడేపల్లిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏబీఎన్ ఛానెల్, ఆంధ్రజ్యోతి పత్రికలలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై వచ్చిన కథనాలను ఖండించారు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణలపై విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి కొడాలి నాని. తాడేపల్లిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏబీఎన్ ఛానెల్, ఆంధ్రజ్యోతి పత్రికలలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై వచ్చిన కథనాలను ఖండించారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు తన కుటుంబసభ్యులను కూడా నమ్మరంటూ వ్యాఖ్యానించారు.

దుర్గగుడిలో చంద్రబాబు క్షుద్రపూజలు చేయించారంటూ నాని ఆరోపించారు. జగన్‌పై అసత్య ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు. దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి రాక్షసుడు కాదని.. రక్షకుడని ప్రశంసించారు. చనిపోయిన వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కొడాలి నాని హితవు పలికారు. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని మంత్రి స్పష్టం చేశారు. కొందరు పనిగట్టుకుని ఇప్పుడు వైఎస్ఆర్‌ను విమర్శిస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు.

చంద్రబాబు పబ్లిసిటీ కోసమే అమరావతికి వస్తున్నారని ఆయన సెటైర్లు వేశారు. చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాలన్న కాంక్షతో పిచ్చిరాతలు రాస్తున్నారంటూ మండిపడ్డారు. అధికారం కోసం మామను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబని.. ఎన్టీఆర్‌ను వాడు, వీడు అన్న చరిత్ర ఆయనదంటూ కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లుగా వైఎస్ జగన్ వ్యక్తిత్వంపై దాడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

Also Read;తుప్పుగాడు చంద్రబాబు, పప్పుగాడు లోకేష్: కొడాలి నాని తిట్లదండకం

వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో అందరూ స్వచ్ఛందంగానే చేరారని.. కండిషన్స్‌కు ఒప్పుకోవాల్సిన దుస్థితి జగన్‌కు లేదని నాని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ మరణంతో తమకు ఎదురులేదని ఎల్లో మీడియా రెచ్చిపోయిందని ఆయన అన్నారు. వైఎస్‌కు మించి వైఎస్ జగన్‌కు ప్రజాదరణ రావడంతో తట్టుకోలేకపోతున్నారని నాని వ్యాఖ్యానించారు. దీనిపై కోర్టుల్లో పరువు నష్టం దావా వేస్తామని.. వైఎస్ జగన్ ఆత్మస్థైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరని కొడాలి నాని స్పష్టం చేశారు. ఎల్లో మీడియా పిచ్చిరాతలను ఇకపై సహించేది లేదని ఆయన వ్యాఖ్యానించారు. సిద్దాంతం కోసం పనిచేస్తున్న వ్యక్తి జగన్ అన్నారు.

రాయలసీమ ప్రాజెక్ట్ విషయంలో జగన్ వెనకడుగు వేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. బీజేపీ, జనసేన రాష్ట్రంలో ఉనికిలో లేని పార్టీలన్నారు. తిరుపతి ఉపఎన్నికల్లో బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చాయో అందరూ చూశారంటూ కొడాలి నాని సెటైర్లు వేశారు. టీడీపీని తొక్కి బీజేపీ రావాలని చూస్తుందని.. అందుకే టీడీపీ, బీజేపీ అలియన్స్ పార్టీలు పోటీపడి దీక్షలు చేస్తున్నాయన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో తాము లెక్కలు తియ్యగలమంటూ మంత్రి హెచ్చరించారు. 

click me!