కృష్ణా జిల్లాలో అనూహ్యంగా పెరిగిన మరణాలు: ఏపీలో కొత్తగా 4,250 కరోనా కేసులు

Siva Kodati |  
Published : Jun 27, 2021, 04:52 PM IST
కృష్ణా జిల్లాలో అనూహ్యంగా పెరిగిన మరణాలు: ఏపీలో కొత్తగా 4,250 కరోనా కేసులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మరోసారి భారీగా పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 4,250 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 18,76,977 చేరుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మరోసారి భారీగా పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 4,250 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 18,76,977 చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 33 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 12,599కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి అనంతపురం 1, ప్రకాశం 1,  తూర్పుగోదావరి 4, నెల్లూరు 3, చిత్తూరు 6, గుంటూరు 2, కర్నూలు 2, కృష్ణ 8, విజయనగరం 1, శ్రీకాకుళం 4, పశ్చిమ గోదావరిలో ఒక్కరు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 5,570 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 18,19,605కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 95,327 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,17,32,933కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 44,773 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 188, చిత్తూరు 673, తూర్పుగోదావరి 890, గుంటూరు 309, కడప 179, కృష్ణ 399, కర్నూలు 121, నెల్లూరు 193, ప్రకాశం 461, శ్రీకాకుళం 131, విశాఖపట్నం 187, విజయనగరం 102, పశ్చిమ గోదావరిలలో 417 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. ఇలా స్కూళ్లు రీఓపెన్ కాగానే అలా సెలవులు.. ఎన్నిరోజులో తెలుసా?
Vemireddy Prashanthi Emotional Speech In Mahanadu | వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి భావోద్వేగ వ్యాఖ్యలు