జంగారెడ్డిగూడెం మిస్టరీ మరణాలపై టీడీపీ పట్టు: ఏపీ శాసనమండలి వాయిదా

Published : Mar 14, 2022, 10:38 AM IST
జంగారెడ్డిగూడెం మిస్టరీ మరణాలపై టీడీపీ పట్టు: ఏపీ శాసనమండలి వాయిదా

సారాంశం

జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలపై  చర్చకు టీడీపీ పట్టుడడంతో  ఏపీ శాసనమండలి వాయిదా పడింది. టీడీపీ సభ్యులు చర్చకు పట్టుబడడంతో  గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో సభను చైర్మెన్ వాయిదా వేశారు. 

మరావతి: పశ్చిమ గోదావరి జిల్లా Jangareddy Gudemలో మిస్టరీ మరణాలపై చర్చకు AP Legislative Council టీడీపీ సభ్యులు పట్టు బట్టారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొనడంతో శాసనమండలిని చైర్మెన్ వాయిదా వేశారు.

సోమవారం నాడు ఏపీ శాసనమండలి ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు ఈ విషయమై  చర్చకు పట్టుబడ్డారు. అంతకు ముందు ఇదే విషయమై TDP సభ్యులు అసెంబ్లీలో కూడా చర్చకు పట్టుబడ్డారు. దీంతో సభను  Speaker వాయిదా వేశారు. శాసనసభ వాయిదా పడడంతో శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసన మండలికి వచ్చారు. అయితే  సరైన ఫార్మెట్ లో వస్తే చర్చకు అనుమతి ఇస్తానని మండలి ఛైర్మెన్ Moshen Raju చెప్పారు. అయితే ఇదే విషయమై టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు.ఈ విషయమై చర్చకు పట్టుబడ్డారు. జంగారెడ్డి గూడెం మరణాలపై సమాధానం చెప్పేందుకు కూడా ప్రభుత్వం సిద్దంగా ఉన్న విషయాన్ని మండలి ఛైర్మెన్ మోషేన్ రాజు చెప్పారు. టీడీపీ సభ్యులు చర్చకు డిమాండ్ చేశారు. ఈ విషయమై టీడీపీ సభ్యులు ప్ల కార్డులు  ప్రదర్శించారు. విపక్ష సభ్యుల తీరును మండలి ఛైర్మెన్ తప్పు బట్టారు. 

ఇటీవల కాలంలో  జంగారెడ్డిగూడెంలో వరుసగా మరణాలు చోటు చేసుకొన్నాయి. అయితే వరుస మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 

జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకొన్న మరణాలకు పలు కారణాలున్నాయని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. మద్యం సేవించడం వల్ల మరణాలు కూడా చోటు చేసుకొన్నాయని కూడా చెబుతున్నారు. అయితే ఇందులో దాదాపు 10 మంది క‌ల్తీ సారా తాగ‌డం వ‌ల్ల‌నే చనిపోయార‌నే ప్రచారం కూడా లేకపోలేదు. 

ఈ మరణాలపై  ద‌ర్యాప్తు నిర్వ‌హించ‌డానికి ప‌బ్లిక్ హెల్త్ డైరెక్ట‌ర్ హైమావ‌తి విజ‌య‌వాడ జీజీహెచ్ డాక్ట‌ర్ల టీమ్  జంగారెడ్డి గూడెనికి  చేరుకుంది. మృతుల కుటుంబాల ఇళ్ల‌కు ఈ టీం వెళ్లింది. మృతుల కుటుంబాల నుండి  వివ‌రాలు సేకరించింది. ఆయా ప్రాంతాల్లో ప‌ర్య‌టించింది. మృతి చెందిన వారిలో ఇందులో ముగ్గురికి మాత్రం మందు తాగే అల‌వాటు ఉంద‌ని చెప్పారు. ఇందులో ప‌లువురు ధీర్ఘకాలిక వ్యాధుల‌తో బాధప‌డుతున్న వారు కూడా ఉన్నార‌ని తెలిపారు. మ‌రి కొంద‌రు 60 ఏళ్ల‌కు పైబ‌డిన వారు ఉన్నర‌ని పేర్కొన్నారు. అయితే మృతుల కుటుంబీకులు మాత్రం త‌మవారు క‌ల్తీ సారా తాగ‌డం వ‌ల్లనే చ‌నిపోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. 

ఈ మ‌ర‌ణాల నేప‌థ్యంలో ప‌లువురు అధికారులు  స‌స్పెన్ష‌న్ కు గుర‌య్యారు. గురువారం ఒక‌రు హాస్పిట్  ల‌కు వెళ్లిన కొంత స‌మ‌యానికి మృతి చెందారు. అయితే ఆయ‌న మృత‌దేహానికి పోస్టు మార్టం చేయ‌లేదు. ఇలా మృతి చెందిన వారెవ‌రికీ పోస్టు మార్టం నిర్వ‌హించ‌లేదు. దీంతో అస‌లు మ‌ర‌ణాలు ఏ కార‌ణంతో సంభ‌విస్తున్నాయ‌నే అంశంపై ఓ క్లారిటీకి రాలేక‌పోతున్నారు. అయితే కల్తీ సారా విక్రయిస్తున్నారనే కుటుంబ సభ్యులు తెలిపడంతో అధికారులు పలు చోట్ల దాడులు నిర్వహించారు. దీంతో పాటు పలు చోట్ల హెల్త్ క్యాంప్ లు చేపడుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu