నువ్వు ఎమ్మెల్యేగా గెలుస్తావా, అన్ని పార్టీలతో కలిసి రా.. చూసుకుందాం : పవన్‌కు కొడాలి నాని సవాల్

Siva Kodati |  
Published : Sep 30, 2021, 05:50 PM ISTUpdated : Sep 30, 2021, 05:58 PM IST
నువ్వు ఎమ్మెల్యేగా గెలుస్తావా, అన్ని పార్టీలతో కలిసి రా.. చూసుకుందాం : పవన్‌కు కొడాలి నాని సవాల్

సారాంశం

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు జీవితంలో వైసీపీని ఓడించలేవంటూ పవన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నువ్వు ముందు ఎమ్మెల్యేగా గెలుస్తావో లేదో చూస్తో అంటూ కొడాలి నాని సెటైర్లు వేశారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు జీవితంలో వైసీపీని ఓడించలేవంటూ పవన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నువ్వు ముందు ఎమ్మెల్యేగా గెలుస్తావో లేదో చూస్తో అంటూ కొడాలి నాని సెటైర్లు వేశారు. అన్ని పార్టీలతో కలిసి రా.. చూసుకుందాం అంటూ మంత్రి సవాల్ విసిరారు. మమ్మల్ని పవన్ కల్యాణ్ భయపెట్టేదేంటీ అంటూ కొడాలి నాని మండిపడ్డారు. ఇంకో జానీ సినిమా చూపంచి భయపెడతారా అంటూ సెటైర్లు వేశారు. పవన్‌ను చూసి ఆయన అభిమానులు భయపడతారని.. చంద్రబాబు స్క్రిప్టులు చదివి మమ్మల్ని భయపెడతారా అంటూ నాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు బూట్లు నాకే వ్యక్తి పవన్ కల్యాణ్ అంటూ మంత్రి ధ్వజమెత్తారు. 

‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఊపేస్తున్న సంగతి తెలిసిందే. ఆ రోజు మొదలు ఇప్పటి వరకు జనసేన, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం భీకరంగా సాగుతోంది. ఏపీ మంత్రులందరూ మూకుమ్మడిగా పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడుతున్నారు. చిత్ర పరిశ్రమ, ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ వంటి అంశాల్లో ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆ రాష్ట్ర మంత్రులు తీవ్రంగా ఖండించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?