2012 పరకాల సభ కేసు : ప్రజాప్రతినిధుల కోర్టులో వైఎస్‌ విజయమ్మ, షర్మిలకు ఊరట

Published : Sep 30, 2021, 05:00 PM IST
2012 పరకాల సభ కేసు : ప్రజాప్రతినిధుల కోర్టులో వైఎస్‌ విజయమ్మ, షర్మిలకు ఊరట

సారాంశం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో 2012లో జరిగిన ఉప ఎన్నికల సమయంలో పరకాలలో ముందస్తు అనుమతి లేకుండా రోడ్డుపై ఎన్నికల కార్యక్రమం నిర్వహించారని విజయమ్మ, షర్మిలపై కేసు నమోదయ్యింది. 

హైదరాబాద్‌ : ప్రజాప్రతినిధుల కోర్టులో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila), విజయమ్మ(YS Vijayammaకు ఊరట లభించింది. అనుమతులు లేకుండా పరకాలలో సభ నిర్వహించి.. ఎన్నికల కోడ్‌ (Election Code‌)ఉల్లంఘించారని 2012లో విజయమ్మ, షర్మిలపై కేసు నమోదయ్యింది. ఈ క్రమంలో గురువారం ప్రజాప్రతినిధుల కోర్టు షర్మిల, విజయమ్మపై నమోదైన కేసును కొట్టేసింది. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో 2012లో జరిగిన ఉప ఎన్నికల సమయంలో పరకాలలో ముందస్తు అనుమతి లేకుండా రోడ్డుపై ఎన్నికల కార్యక్రమం నిర్వహించారని విజయమ్మ, షర్మిలపై కేసు నమోదయ్యింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని 2012లోనే పరకాల పోలీస్ స్టేషన్‌లో వీరిపై కేసు నమోదు చేశారు. తాజాగా ప్రజాప్రతినిధుల కోర్టు ఈ కేసును కొట్టేసింది.

Badvel bypoll: బీజేపీ, జనసేన మధ్య కుదరని ఏకాభిప్రాయం, కొనసాగనున్న చర్చలు

ఇదిలా ఉండగా.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల మండిప‌డ్డారు. రైతుల‌ను ఆదుకోకుండా వారిని క‌న్నీటిలో ముంచుతున్నార‌ని ఆమె ఆరోపించారు. 'రైతుల‌కు పెట్టుబడి రాకపోతే, పండిన పంట వరద పాలైతే, ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేస్తే, రైతు చావక ఇంకేం చేస్తాడు దొరా?' అని ష‌ర్మిల ప్ర‌శ్నించారు.

'కేసీఆర్ ఒక్క రైతు బంధు ఇచ్చిండు. ఫసల్ బీమా బంద్ పెట్టిండు. పంటలకు బీమా లేదు, రైతుకు ధీమా లేదు, పంటలు వాన పాలు. కష్టం నీటి పాలు. రైతును కన్నీటిలో ముంచిండు' అని ష‌ర్మిల చెప్పారు. 'తాను పెద్ద రైతును అని చెప్పుకొనే దొరగారికి రైతు ఆత్మహత్యలు ఎందుకు చేసుకొంటున్నారో తెలియదట .. అందుకే కమిటీ వేసిండు. కోర్టులు మొట్టి కాయలు వేయనిదే మీకు ఏ పని చేయాలనే సోయి రాదు కానీ.. కనీసం ఇప్పటికైనా పంటల బీమాను అమలు చేసి రైతులను ఆదుకోండి' అని వైఎస్ ష‌ర్మిల డిమాండ్ చేశారు

 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!