రుణమాఫీ రూ.87 వేల కోట్లయితే.. చేసింది రూ.15 వేల కోట్లే:బాబుపై కన్నబాబు ఫైర్

By Siva KodatiFirst Published Sep 26, 2019, 7:25 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీపై మంత్రి కన్నబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతులు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని 2014లో టీడీపీ హామీ ఇచ్చిందన్నారు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రూ. 15 వేల కోట్లను మాత్రమే మాఫీ చేశారని కన్నబాబు ఆరోపించారు

తెలుగుదేశం పార్టీపై మంత్రి కన్నబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమరావతిలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రైతులు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని 2014లో టీడీపీ హామీ ఇచ్చిందన్నారు.

కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రూ. 15 వేల కోట్లను మాత్రమే మాఫీ చేశారని కన్నబాబు ఆరోపించారు. ఇచ్చిన హామీలను ఎందుకు నిలబెట్టుకోలేకపోయారని మంత్రి ప్రశ్నించారు.

రూ. 87 వేల కోట్లు రుణాలను మాఫీ చేయాల్సిందిగా కమిటీలు వేసి కోత విధించారని కన్నబాబు మండిపడ్డారు. రైతు రుణమాఫీ జరిగిన తీరుపై చంద్రబాబు చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.

ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు హడావుడిగా ఎందుకు రుణమాఫీ జీవో విడుదల చేశారంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తోందని.. అటువంటి తమపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని కన్నబాబు దుయ్యబట్టారు.

click me!