జగన్ సంచలన నిర్ణయం: విశాఖమన్యంలో 30ఏళ్ల వరకు బాక్సైట్ తవ్వకాలు రద్దు

By Nagaraju penumalaFirst Published Sep 26, 2019, 4:45 PM IST
Highlights

ఇకపోతే ప్రతిపక్షంలో ఉన్న సమయంలో గిరిజనుల పోరాటానికి సీఎం జగన్ అండగా నిలిచారు. అధికారంలోకి రాగానే బాక్సైట్‌ తవ్వకాల జీవోను పూర్తిగా రద్దు చేసి గిరిజనులకు మేలు చేస్తామని జగన్‌ పాదయాత్రలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 
 

అమరావతి: విశాఖపట్నం మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం అటవీ, పర్యావరణ శాఖలపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బాక్సైట్ తవ్వకాల రద్దుపై కీలక నిర్ణయం తీసుకున్నారు.

విశాఖపట్నంలో గత ప్రభుత్వం ఇచ్చిన బాక్సైట్ తవ్వకాల అనుమతులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలోని అపారమైన బాక్సైట్ ఖనిజ సంపద ఉంది. 

గత ప్రభుత్వం అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్, జెర్రెల బ్లాక్-1,2,3, గాలికొండ, చిత్తమగొండి, రక్తకొండ, చింతపల్లి రిజర్వ్ ఫారెస్ట్ గ్రామాల్లో బాక్సైట్ తవ్వకాలకు తెలుగుదేశం ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే.  

అంతేకాకుండా మరో 30ఏళ్లపాటు మన్యంలో ఎలాంటి బాక్సైట్ తవ్వకాలకు అవకాశం ఇవ్వకుండా జీవో జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో సీం జగన్ బాక్సైట్ తవ్వకాలను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఇకపోతే ప్రతిపక్షంలో ఉన్న సమయంలో గిరిజనుల పోరాటానికి సీఎం జగన్ అండగా నిలిచారు. అధికారంలోకి రాగానే బాక్సైట్‌ తవ్వకాల జీవోను పూర్తిగా రద్దు చేసి గిరిజనులకు మేలు చేస్తామని జగన్‌ పాదయాత్రలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

బాక్సైట్ తవ్వకాలు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ మనుగడను కాపాడిన సీఎం జగన్ అంటూ కృతజ్ఞతలు తెలిపారు.

బాక్సైట్‌ అనుకూల జీవో నెంబర్ 97ను రద్దు నిర్ణయం చరిత్రాత్మకం అని వైసీపీ నేతలు జగన్ నిర్ణయాన్ని కొనియాడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం బాక్సైట్‌ను తవ్వి గిరిజనులను నాశనం చేసే చర్యల్లో భాగంగానే ఈ జీవోను జారీ చేసిందని తెలిపారు. 

click me!