29 గ్రామాల్లో పూలు పడినా.. 30వ గ్రామంలో రాళ్లవర్షమే: బాబుపై కన్నబాబు వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Jan 23, 2020, 4:15 PM IST

29 రాష్ట్రాలను ప్రభావితం చేస్తానని చెప్పి.. 29 గ్రామాలకే పరిమితం అయిపోయాడన్నారు. 29 గ్రామాల్లో పూలు జల్లుతున్నారని కానీ 30వ గ్రామానికి వెళితే రాళ్ల వర్షం కురుస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు పరిపాలనా వికేంద్రీకరణే శరణ్యమని, అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని కన్నబాబు సూచించారు. 


29 రాష్ట్రాలను ప్రభావితం చేస్తానని చెప్పి.. 29 గ్రామాలకే పరిమితం అయిపోయాడన్నారు. 29 గ్రామాల్లో పూలు జల్లుతున్నారని కానీ 30వ గ్రామానికి వెళితే రాళ్ల వర్షం కురుస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు పరిపాలనా వికేంద్రీకరణే శరణ్యమని, అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని కన్నబాబు సూచించారు. 

రాష్ట్రంలోని అన్ని ప్రాంతా అభివృద్ధి లక్ష్యంగా పరిపాలనా వికేంద్రీకరణ చట్టం చేయాలని భావించామని మరో మంత్రి కన్నబాబు తెలిపారు. వ్యవస్థలను భ్రష్టుపట్టించడంలో చంద్రబాబు దిట్టని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంలో ఆయనను మించినవారు లేరని ఎద్దేవా చేశారు.

Latest Videos

చంద్రబాబు 4 గంటల పాటు గ్యాలరీలో కూర్చుంటారా..? అలాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉండటం దురదృష్టకరమని అని కన్నబాబు ఫైర్ అయ్యారు. ఛైర్మన్‌ను ప్రభావితం చేయడానికి చంద్రబాబు తెగ తపనపడ్డారని.. అదే సమయంలో ఛైర్మన్ కూడా ఏకపక్షంగా వ్యవహరించారని కన్నబాబు మండిపడ్డారు.

Also Read:మెజార్టీ ఉందని ఇష్టమొచ్చినట్లు చేశారు: మండలి పరిణామాలపై బుగ్గన వ్యాఖ్యలు

మండలి ఛైర్మన్ విచక్షణాధికారాలపై చర్చ జరగాలని.. విచక్షణాధికారాల్లో రూల్స్‌ను అతిక్రమించడానికి విల్లేదని స్పష్టంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నాయకులు పనిచేస్తే ఏం చేయాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రులు, ఎమ్మెల్యేలపై టీవీల్లో తప్పుగా మాట్లాడే వాళ్లపై చర్యలు తీసుకునేలా చట్టం చేయాలని కన్నబాబు సూచించారు. అన్ని పార్టీల రాజకీయాలు తానే చేయాలని చంద్రబాబు అనుకుంటారని.. బిల్లుల్ని ఆపినంత మాత్రాన ఏం సాధిస్తారని ఆయన ప్రశ్నించారు.

బుధవారం బ్లాక్ డే కాదని.. ఎల్లో డే అని... నారా లోకేశ్ మండలిలో ఫోటోలు, వీడియోలు తీశారని కన్నబాబు ఆరోపించారు. మండలిని కింఛపరచడం తమ ఉద్దేశ్యం కాదని కానీ.. ఇలాంటి సభలు అవసరమా అనే చర్చ మళ్లీ మొదలైందని కన్నబాబు తెలిపారు.

Also Read:మండలి రచ్చ: పోడియం పైకెక్కిన కొడాలి నాని (ఫోటోలు)

పెద్దల సభ అంటే సలహాలు ఇచ్చి ఏదైనా బిల్లును మరింత మెరుగుపరిచేలా వ్యవహరించాలని.. కానీ రూల్స్ వెతికి బిల్లులు అడ్డుకోవడం కాదన్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఎవరిని పొగుడుతాడో, ఎవరిని తిడతాడో తెలియదన్నారు. ఎన్నికలకు ముందు ప్రధానిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి.. ఆ తర్వాత కౌగిలింకుంటున్నాడని కన్నబాబు మండిపడ్డారు. 

click me!