చంద్రబాబువి దొంగ పర్యటనలు.. రైతుల వేషాల్లో వుంది టీడీపీ నేతలు : మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి

By Siva KodatiFirst Published May 6, 2023, 2:36 PM IST
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పర్యటనపై మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మండిపడ్డారు. రైతులు నిజాలు మాట్లాడుతుంటే ఆయన తట్టుకోలేకపోతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. శనివారం నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన రైతులను అడ్డం పెట్టుకుని చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట నష్టానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం రెండు జీవోలను జారీ చేసిందని.. కానీ ఆ విషయం విపక్షనేతకు తెలియదన్నారు. చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని.. రైతు బీమాకు సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోందని కాకాణి తెలిపారు. టీడీపీ హయాంలో ఏ ఏ రైతు ప్రీమియం చెల్లిస్తారో వారికే పంట బీమా వచ్చేదని.. కానీ రైతులందరికీ రక్షణ కల్పించాలనే లక్ష్యంతో ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తున్నామన్నారు. 

వర్షాల కారణంగా రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. 2000 వేల రైతు భరోసా కేంద్రాల్లో మొక్కజోన్న కొనుగోలుకు శ్రీకారం చుట్టామని ఆయన వెల్లడించారు. రైతులు వాస్తవాలు మాట్లాడుతుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడని .. అందుకే టీడీపీ కార్యకర్తలతో రైతుల వేషం వేయించి మాట్లాడిస్తున్నారని మంత్రి ఆరోపించారు.

ALso Read: టిడిపికి షాక్... సీఎం సమక్షంలో వైసిపిలోకి నెల్లూరు సీనియర్ నేత (వీడియో)

ఇకపోతే.. రైతుల అన్యాయమైన డిమాండ్ ను  హైకోర్టు కొట్టివేసిందని  ఏపీ ప్రభుత్వ సలహదారు  సజ్జల రామకృష్ణారెడ్డి  చెప్పారు. ఆర్-5 జోన్ పై  ఏపీ హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వ సలహదారు  సజ్జల రామకృష్ణారెడ్డి  శుక్రవారం నాడు స్పందించారు. ఆర్ 5 జోన్ పై హైకోర్టు తీర్పును ఆయన  స్వాగతించారు. రాజధాని అంటే ప్రజలందరూ ఉండే ప్రాంతంగా  ఆయన పేర్కొన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారని సజ్జల టీడీపీపై  మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశ్యంతో అమరావతిలో  ఇళ్ల పట్టాలను  అడ్డుకొనే ప్రయత్నం  చేశారని ఆయన చెప్పారు.  


 

click me!